(దండుగుల శ్రీనివాస్ )
రేవంత్, సబిత ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంతకు మించి బంధువులు. రేవంత్, సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు, వీరిద్దరూ కలిసి విదేశాలకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన రోజులున్నాయి. మరి ఎందుకు అసెంబ్లీలో సబితను టార్గెట్ చేశాడు రేవంత్..? రేవంత్ కావాలని టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసేలా వ్యూహం పన్నాడు భట్టి విక్రమార్క. ఆ వ్యూహంలో చిక్కుకుని నోటికొచ్చింది మాట్లాడి అభాసుపాలయ్యాడు రేవంత్. అసలు సంగతేంటంటే.. భట్టికి అత్యంత సన్నిహితుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్).
సబితా రేపోమాపో పార్టీ మారుతుందని, ఎవరు అడ్డుపడినా రేవంత్ ఆమెను పార్టీలోకి తీసుకొస్తాడని తెలిసిపోయింది భట్టికి. సబిత వస్తే కేఎల్ఆర్ రాజకీయ భవిష్యత్‌కు పునాదే. మహేశ్వరం లో ఆమెదే పట్టు. రంగారెడ్డి జిల్లాలో ఆమె ఓ స్ట్రాంగ్ లీడర్. కచ్చితంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి.
ఆమె రాకను అడ్డుకోవడంతో పాటు తన సహచరుడు కేఎల్ఆర్‌కు అడ్డుతొలగించే పని చేయాలంటే సబితను టార్గెట్ చేయాలి. అదే చేశాడు భట్టి. ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు రేవంత్. ఎడాపెడా నోటికేదొస్తే అది మాట్లాడాడు. వాస్తవానికి ఆమెపై అంతగా విరుచుకుపడాల్సిన అవసరం లేకుండె. మొత్తానికి భట్టి ఎత్తుకు చిత్తయ్యాడు రేవంత్. ఇప్పుడు ఆమె పార్టీలోకి రాదు. తీసుకోరు. కేఎల్ఆర్ సేఫ్. రేవంత్ ప్లానింగ్‌కు గండికొట్టాడు ఇలా భట్టి.