వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి ఇందూరుకు వచ్చిన ఈరవత్రి అనిల్‌కు పద్మశాలీలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈరవత్రి అనిల్‌కు పద్మశాలీలంతా తోడుగా ఉన్నారని, ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే ఇందూరు నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచేవాడని అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా ఆయనను అన్ని వర్గాలు కలిపి గెలిపించుకుంటాయని వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా చేసిన సమయంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడని పద్మశాలీ సంఘం నేతలంతా ముక్తకంఠంతో అనిల్ నాయకత్వాన్ని కోరారు.
ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్‌గా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆయన జిల్లా రాజీకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని, కాబోయే ఎమ్మెల్యేగా వారంతా అభివర్ణించారు.