దండుగుల శ్రీనివాస్ – వాస్తవం బ్యూరో చీఫ్ :
ఇందూరు జిల్లాకు పెద్ద పదవి దక్కనుంది. బోధన్ ఎమ్మెల్యే, సీనియర్ లీడర్, మాజీ మంత్రి పద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి కేబినెట్‌లో బెర్త్ ఖరారయ్యింది. తన వద్ద ఉన్న హోం మినిస్ట్రీ ఫోర్ట్ ఫోలియోను సుదర్శన్‌రెడ్డికి అప్పగించేందుకు సంసిద్దమయ్యాడు సీఎం రేవంత్‌రెడ్డి. కేబినెట్ విస్తరణకు సంబంధించిన ముహూర్తం కూడా ఖరారయ్యింది. ఈనెల 4న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్దం అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు గవర్నర్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు కూడా.
ఇక ఇవే లాస్ట్ ఎన్నికలుగా, పాలిటిక్స్‌కు ఇక రిటైర్‌మెంట్ ప్రకటించుకున్న సుదర్శన్‌రెడ్డి రాజకీయ చరమాంకంలో కీలక ప్రాధాన్యత గలిగిన మంత్రి పదవి దక్కనుంది. సీఎం తరువాత చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఫోర్ట్‌ఫోలియో ఇదే. అది ఇందూరు జిల్లాకు కేటాయించడంతో ఇక్కడ రాజకీయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.
పీసీసీ చీఫ్‌గా ఎవరికిస్తారనేదానిపై ఇంకా టెన్షన్ కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడింట్ మహేశ్‌కుమర్ గౌడ్‌లు ఢిల్లీలో ఇదే విషయమై అధిష్టానం వద్ద చర్చించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ తనకు పీసీసీ చీఫ్ ఇవ్వాలని అధిష్టానాన్ని గట్టిగానే కోరుతున్నారు.
సీఎం రేవంత్ మద్దతు కూడా మహేశ్‌కు ఉన్నది. అయితే ఎస్టీ కోటాలో బలరాం నాయక్‌కు పీసీసీ ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. పీసీసీ చీఫ్‌గా ఇది వరలో దివంగత నేత డీఎస్ వ్యవహరించారు. ఆ పదవికి వన్నెతెచ్చారు. ఇందూరు పేరు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఢిల్లీ రాజకీయాల్లో కూడా కీలకంగా మార్చారు డీఎస్ . మరోసారి మహేశ్ రూపంలో పీసీసీ చీఫ్ ఇందూరుకే దక్కుతుందనే ప్రచారం సాగుతుంది.
ఇదే ఫైనల్ అయితే ఇందూరు జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రధాన్యత ఇచ్చిందనే చెప్పాలి.