దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

 

కాంగ్రెస్‌ మార్పు రాజకీయంపై ప్రజలకప్పుడే ఏవగింపు కలుగుతోంది. కేసీఆర్‌ గురుతులు చెరిపేసే పనిలో రేవంత్‌రెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. ఇచ్చిన హామీలు అమలు పర్చేందుకు ఖజనాలో పైసల్లేవంటు రోజులు గడుపుతూ , జనాలను మభ్య పెడుతూ వస్తున్న సీఎం.. మార్పుల పేరుతో మాత్రం విచ్చలవిడిగా పిచ్చిగా ఖర్చు పెడుతున్నాడు. గత రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతూ సర్కార్‌ను ఎండగడుతూ వస్తున్నది.

నెంబర్‌ ప్లేట్లను టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు, తెలంగాణ చిహ్నాన్ని మార్చేందుకు, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు అక్షరాల రూ. 2767 కోట్లు ఖర్చు చేశారంటూ తిట్టిపోస్తున్నారు. వ్యంగ్రాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు ఈ మార్పులే పనికిరానివనే భావనలో ఉన్న జనం.. వీటికి ఇంత మొత్తం ఖర్చు చేశారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇప్పుడు ఈ మార్పులను ఎవరూ కోరుకోవడం లేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చుందుకు ఇచ్చిన హామీలెప్పుడు అమలవుతాయా అని మాత్రమే ఎదురుచూస్తున్నారనే హితబోధ చేస్తున్నారు. కేసీఆర్‌ గురుతులను చెరిపేసే పని కోసం కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వలేదనేది , మీరేం చేస్తారో చేసి చూపండి అని ప్రజల నుంచి అప్పుడు పెదవి విరుపు మొదలైంది. సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఇలాంటి మార్పు కోతి చేష్టలతో కాంగ్రెస్‌ సర్కార్‌ అప్పుడే ప్రజల వద్ద పలుచనవుతూ వస్తోంది.

 

You missed