వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
రేవంత్‌రెడ్డిపై అలక వహించే నేతల సంఖ్య పెరుగుతున్నది. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని పార్టీలోకి తీసుకునే విషయంలో రేవంత్ ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు గంట ముందే కీలక నేతలకు సమాచారమిచ్చి షాక్‌నిచ్చాడు. దీనిపై కీలక నేతలు కినుక వహించారు. ఇదేం దోరణి..? పోచారంతో మనకొచ్చిన లాభమేమిటి..? వాళ్ల ఉనికి కోసం తండ్లాడుతూ మన పంచన చేరారు తప్పితే ఇప్పుడు వారిని పార్టీకి తీసుకోవడం అవసరమా..? అని బాహాటంగానే రేవంత్ చర్యలను విమర్శిస్తున్నారు.
ఇదిలా కొనసాగుతుండగానే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కూడా రాత్రికి రాత్రే ఇంటికి పిలిపించి కండువా కప్పేశాడు రేవంత్. దీనిపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి భగ్గుమన్నాడు. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఘోర పరాభవం చవిచూసిన జీవన్‌కు.. ఈ చర్య అసలే గిట్టలేదు. మంత్రి పదవి లేదు.. ఎంపీగా గెలవలేదు.. ఇప్పుడు తన నెత్తిపై సంజయ్‌ను తీసుకొచ్చి పెడితే .. ఇక నియోజకవర్గంలో తనేం చేసిదని పాపం తెగ భయపడిపోయి.. కోపం తెచ్చుకుని ఏమీ చేయలేక.. రాజీనామా అస్త్రాన్ని ఒకటి ప్రయోగించాడట.
ఇప్పుడు ఈ పంచాయితీ ఢిల్లీ పెద్దల వరకు చేరింది. వీరిలా రేవంత్‌పై ఒంటికాలుతో లేచి గుర్రు మంటునూ ఉండగా.. రేవంత్ మాత్రం ఇంకా లైన్లో రెడీగా ఉన్న ఎమ్మెల్యేల మెడలో కండువాలు మెడలో వేసేందుకు తన కారు ఢిక్కీలో కండువాలు నింపుకుని తిరుగుతున్నాడు.