దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

రాజకీయలంటే అంతే! ఎన్నో నటనలు..!! మరెన్నో నయవంచనలు..!! ప్రాణమున్నంత వరకు మీతోనే ఉంటా సార్‌.. మీలాంటి నాయకుడిని నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో నేనెప్పుడూ చూడలేదు.. అంటూ వేదికల మీద ఉపన్యాసాలు దంచిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కొడుకు కోసం పార్టీ మారాడు. అంతే ఎవరి అవసరాలు వారికి. అందుకే ఈ అవకాశవాద రాజకీయాలు. ఇప్పుడు చెప్పొచ్చేది ఓ డాక్టర్‌ లీడర్‌ గురించి.

కవితక్క అంటే నాకు ప్రాణం. ఆమె కోసం ప్రాణాలైన ఇస్తా.. అక్కా నేను రాజీనామా చేస్తా.. లేదా నా సీటు త్యాగం చేస్తా.. నాదగ్గర వచ్చి పోటీ చెయ్‌.. గెలిపించుకుంటా… అని బీరాలు పలికిన ఈ దూర్త నాయకుడు.. ఇప్పుడు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లోనే కాంగ్రెస్‌కు సరెండర్‌ అయ్యాడు సంజయ్‌. పేరుకు డాక్టర్‌. కానీ అన్ని వ్యాపారాలే. క్రషర్ల నడిపిస్తూ కోట్లకెదిగాడు. వీటిపై జీవన్‌రెడ్డి ఉక్కుపాదం మోపాడు. బిడ్డా నాకు సపోర్టు చేస్తావా.. లేకపోతే నీ వ్యాపారాలన్నీ ఆపేస్తావా..? చూసుకుందాం అనే లెవల్‌లో వార్నింగ్‌ ఇచ్చాడు.

దీంతో ముచ్చెమటలు పట్టిన డాక్టర్‌ లోపాయికారిగా అప్పుడే సరెండర్ అయిపోయాడు. ఎంపీ ఎన్నికల్లో తూతూ మంత్రంగా ప్రచారం చేశాడు. వీలైనన్ని కాంగ్రెస్‌కే ఓట్లు పడేలా చేశాడు. ఇప్పుడిలా ముహూర్తం చూసుకుని రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ జెండా కప్పుకున్నాడు. అక్కా..! నీ వల్లే నా జీవితం..! నువ్వు లేకపోతే నేను లేను..! నా ఎమ్మెల్యే పదవి లేదు..!! అని నమ్మబలికే మాటలతో కవితను మోసం చేసిన ఈ లీదర్‌.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చక్కరొచ్చి కిందపడిపోయే దాకా ప్రచారం చేయించుకున్నాడు.

ఇప్పుడామె లేదు. జైలుకు పోయింది. పార్టీ పరిస్థితి ఘోరంగా మారింది. మరోపైపు తన వ్యాపారాలు, ఆదాయాలు ఆగిపోయాయి. ఏం చేయాలి.చలో జంప్‌…! డాక్టర్‌ సంజయ్‌ అనే రాజకీయ రోగికి కాంగ్రెస్‌ సెలైన్‌ ఎక్కించారు. ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నాడు.

You missed