దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ఉన్నదున్నట్టంటే ఉలుకెక్కువన్నట్టు .. పాపం భాస్కర్కరెడ్డి ఉలిక్కిపడ్డాడు. తన ప్రాపకం చెల్లుబాటు కావడం లేదని, తనకు సహజమైన రీతిలో బెదిరింపులు, అధికారం చెలాయించడం సాధ్యం కావడం లేదని పార్టీ మారిన భాస్కర్ రెడ్డి .. వరుస కథనాలు రాస్తున్న ‘వాస్తవం’ ప్రతినిధి దండుగుల శ్రీనివాస్‌ను బెదిరించాడు. పనిలో పని మీడియా విలువలు కాపాడంటూ నీతి ప్రవచనలు వల్లించిన సదరు ఈ యువనేత.. ఇలాగే నువ్వు రాయి.. నీ సంగతి చూస్తా అనే దాకా వెళ్లాడు. సహజమే. ఇది ఆయనకు అలవాటు దోరణే.
గతంలో బాన్సువాడకు చెందిన ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్టర్‌ను, జిల్లా మైనింగ్ అధికారులను ఫోన్‌లోనే ఎడాపెడా, చెడామడా.. నోటికొచ్చిన బూతులు మాట్లాడి తన నోటిదూల, కండకావరం ప్రదర్శించిన భాస్కర్‌రెడ్డి.. తాజాగా ‘వాస్తవం’పై కూడా అదే రీతిలో చెలరేగిపోయాడు. ఇప్పుడు మరీ అధికార పార్టీలో చేరాడు కదా. ఇంకా రెచ్చిపోయాడు. నాకు కార్పొరేషన్ పదవి ఇస్తానంటే నా తండ్రి ఎందుకు వద్దంటాడు.. అంటూ పాపం తెగ బెంబేలు పడ్డాడు. పదవి వచ్చేదుంటే వాస్తవం కథనం రాయగానే ఆగిపోతుందా..? మరి ఎందుకు అంత దుగ్ద.
పదవి వస్తే మేమే రాస్తం కాదా అంటే మా వివరణ లేకుండా ఎందుకు రాశావంటాడు. నేను ఫోన్ చేస్తే లేపలేదు కదా.. అంటే సమాధానం లేదు. నమస్తే తెలంగాణ నుంచి దండుగుల శ్రీనివాస్‌ను ఇలాంటి కథనాలు రాసినందుకే తీసేశారని అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. నేను మొండోడిని చూసుకుందామని కయ్యానికి కాలుదువ్వడమే కాదు.. బాలయ్య బాబులా మాటలతో తొడలు కూడా చరిచాడు. ఏం చేస్తాడో ఏమో మరి.