దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

పోచారంకు ‘సన్‌’ స్ట్రోక్‌ తగిలింది. కొడుకు భాస్కర్‌రెడ్డి కోసం పార్టీ మారక తప్పలేదు. కేసీఆర్‌ కు చేతివ్వక తప్పలేదు మరి పెద్దమనిషి. రిటైర్‌మెంట్‌ పాలిటిక్స్‌లో ఆయనకు రాజకీయంగా చెడ్డపేరే మిగిలింది. ఇప్పుడు పేరెవరికి కావాలంటారా..? అంతే. అదే ఆలోచించి ఉంటాడు పోచారం. కేసీఆర్‌ ముద్దుగా మా భీముడు అని పోచారాన్ని పిలుచుకునేవాడు. ఆ భీముడు ఇప్పుడు కేసీఆర్‌ ముడ్డి మీద గదలో ఒక్కటిచ్చాడు. అసలే పార్టీ, కేసీఆర్ పరిస్తితి మూలిగేనక్కలా మారింది. ఇప్పుడు తడిపండు పడింది. ఇక తాటిపండ్లు పడటానికి సిద్దంగా ఉన్నాయి.

పోచారం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో రాగానే బాన్సువాడ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. పోచారం దిష్టిబొమ్మల దహనాలు చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో ఎవరినీ ఎదగనీయడాని అతని కొడుక ఆగడాలు, అవినీతి అంతా ఇంతా కాదని దుమ్మెత్తిపోశారు. కానీ చివరకు పార్టీ అధిష్టానం పోచారం శ్రీనివాస్‌రెడ్డికి గాలం వేసింది.

కొడుకు టార్చర్‌కు ఆ గాలానికి ఉత్తగనే చిక్కాడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. పోచారానికి ప్రచారం జరిగినట్టుగా మంత్రి పదవి ఏమీ ఉండదు. కీలకమైన పదవి కూడా డౌటే ప్రస్తుతానికి. ఎందుకంటే ఆయన పార్టీలో చేరడమే ఎవరికీ ఇష్టం లేదు. అలాంటప్పుడు పిలిచి మరీ పదవులిస్తే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇది పార్టీకి మరింత నష్టమే చేస్తుంది. అందుకే కొడుకు కు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్‌ ఆశ చూపాడు రేవంత్‌.

భాస్కర్‌రెడ్డికి ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనేది ఆశ. అందుకోసం పాపం.. పోచారం రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాడు. రాజకీయ చివరి మజిలీలో బొక్కబోర్లా పడ్డాడు. కులం చెడ్డా సుఖం దక్కాలన్నట్టు కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదే పదివేలనుకుంటున్నాడు. అంతే..!

You missed