దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
ఏనుగు రవీందర్‌రెడ్డి పెట్టే టార్చర్ భరించలేకపోయాడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అతని తనయుడు భాస్కర్‌రెడ్డి. పోలీసులు పెట్టే థర్డ్ డిగ్రీని తలపించింది ఏనుగు ప్రతీకారేచ్చ..! ఎమ్మెల్యేగా గెలిచినా సుఖం లేకుండా పోయింది ఇద్దరికీ. మంత్రిగా, స్పీకర్‌గా రాజ్యమేలిన పెద్దమనిషిని ఎవరూ కానడం లేదక్కడ. పరిస్థితి ఎలా దాపురించిందంటే.. ఓ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఓ పని చెప్పినా కూడా పెడచెవిన పెట్టే దాకా..! ఎంతటి వారము మేము ఎలా అయితిమి నేడు.. అని చింతించని రోజంటూ లేదు.
అలా కాంగ్రెస్ గూటికి చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది వీరికి. బీఆరెస్‌కు భవిష్యత్ లేదు. తను ఎలాగూ రిటైర్‌మెంట్ కానున్నాడు. కొడుకు లైఫ్ అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ ఏనుగు రవీందర్‌రెడ్డి పెట్టని తిప్పలు లేవు. చూపని నరకయాతన లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్సు. ఎలాగ బతికేది. రాజకీయంగా ఇంకెంతకాలం ఈ నరకయాతన… అని ఆలోచిస్తున్న సమయంలో రెడ్డి లాబీయింగ్ పోచారం అండ్ సన్‌ను కాపాడింది.
రెడ్లంటే చెవి కోసుకుంటాడు పోచారం రెడ్డి. చాలా వేదికల్లో మనం వెనుక రెడ్డి తోక తగించుకోకపోతే అదేదో దేశద్రోహం అనే రేంజ్ లో ఆవేశంగా స్పీచ్ దంచాడు పోచారం. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ సర్కార్ పక్కా రెడ్ల రాజ్యమే. మొత్తం రెడ్లతోనే నింపుకుంటున్నారు. ఈ విధంగానైనా ఏనుగు రవీందర్‌రెడ్డి అనే యముడి బారినుంచి తప్పించుకోవడం ఒక మార్గమైతే.. కొడుకు లైఫ్‌కు ఓ భరోసా అందులో ఇంకోభాగం.. ఇలా కారణలేమైనా కాంగ్రెస్ తప్ప మరోమార్గం లేదు పోచారం అండ్ సన్‌కు.
అందుకే ఇలా ఎంతమంది వ్యతిరేకించినా.. కేసీఆర్ సుమచిత ప్రాధాన్యమిచ్చి నెత్తికెక్కించుకుని భీముడూ అని ముద్దుగా పిలిచుకున్నా… రేవంత్ ఇప్పుడు రైతుపక్షపాతి, రైతుదేవుడు, రైతునాయకుడు, రైతు సంరక్షుడు అంటూ కీర్తించే దౌర్బగ్యానికి నోచుకున్నాడు అధికారం కోసం.