దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో:

మంత్రివర్గ విస్తరణలో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇప్పటి వరకు వేసుకున్న సమీకరణలు మారనున్నాయి. పార్టీని మరింత బలపర్చేందుకు, ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేవిధంగా తయార్యేక్రమంలో కొత్త వారిని ఎంకరేజ్‌ చేస్తున్నది కాంగ్రెస్‌ అధిష్టానం. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరుండాలనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చాడు. కానీ పాతవారిని, సీనియర్లను కూడా కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టాల్సిన పరిస్తితులు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లో అదే జరుగుతున్నది. నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పట్నుంచో టాక్‌ ఉంది.

హోం మినిష్టర్‌ కూడా ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడిది అతని చేయి దాటింది. అవును.. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇదే నిజం కాబోతున్నదని వాస్తవం పరిశీలనలో వెలుగుచూసింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రిని కాంగ్రెస్‌లోకి తీసుకుని అతనికి మంత్రి పదవిని ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా ఉన్న ఈ నేతకు ఇప్పుడు రేవంత్‌ గాలం వేశాడు. కీలకమైన ఫోర్ట్‌ ఫోలియో కూడా ఇస్తామనే ఆఫర్‌ ఉంది. దీంతో ఈ మంత్రి వర్గ విస్తరణలో ఇందూరు గులాబీ నేతకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇది కనీసం ఎవరూ ఊహించని పరిణామమే.

జిల్లాలో బీఆరెస్‌ మొత్తం కుప్పకూలింది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మరీ ఘోరంగా చతికిలబడి ఇక ఇప్పట్లో లేవలేమనే స్థాయికి దిగజారింది. రానున్న లోకల్‌బాడీ ఎన్నికల్లో కూడా పోటీకి గట్టిగా నిలబడలేని దీన పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. కాంగ్రెస్‌ కూడా ఇంకా నిర్జీవంగానే ఉంది. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండలో వీక్‌గానే ఉంది. బోధన్‌, అర్బన్‌లో మైనార్టీలు తోడు రావడంతో కాస్త బెటర్‌.

ఈ క్రమంలో రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని మరింత బలంగా మార్చుకుని జిల్లాలో కంచుకోటలా నిలిపేందుకు మంత్రిగా సుదర్శన్‌రెడ్డికి బదులు బీఆరెస్‌ మాజీ మంత్రికి ఇవ్వడం బెటర్‌ అని లెక్కలు వేసుకున్నట్టు తెలిసింది.

ఈ మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డికి చేదు అనుభవమే మిగలనుంది. రాజకీయాల నుంచి రిటైర్‌ అయ్యే సమయం ఆసన్నమైన తరుణంలో ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తదని అంతా భావించారు. కానీ రాజకీయ అవసరాలు అందుకు భిన్నంగా లెక్కలు వేసుకున్నాయి. ఈ లెక్కలతో జిల్లా రాజకీయ పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారనున్నాయి.

 

You missed