దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

అర్వింద్‌ ఓ అంహకారి..!ఓ కుసంస్కారి..!! నడిమంత్రపు సిరితో కన్నుమిన్నుగానకుండా ఉన్న నేత..!!! ఇంకా.. ఇంకా.. ఇవన్నీ ఆ పార్టీ నేతలే అంటున్న మాటలు. అవును.. మరి అలాగే ఉంది అతగాడి వైఖరి. సీఎం కూతురు కవితనే ఓడగొట్టి గెలిచిన అనే అహం పెరిగి పెద్దదై వటవృక్షమై కళ్లు నెత్తికెక్కి ఇప్పుడు అదే కొంపముంచే స్థాయికి తెస్తున్నది. నోరు పారేసుకుంటే సరి.. గట్టిగా నాలుగు బూతులు తిడితే మాస్‌.. పెద్దోళ్లను తిడితే అదే తనకు మైలేజీ అనే సూత్రాలను నమ్ముకుని నేత అర్వింద్‌. అది తొలత కొంత పనికి వచ్చింది. గుర్తింపూ తెచ్చింది. ఇప్పుడు పరమ చెత్తగా అనిపిస్తుంది ప్రజలకు. రొటీన్‌ మాటలు సుత్తికొడుతున్నాయి.

ఎప్పుడూ మాటలు చెప్పడమేనా..? వీడీయోలు వదులుతూ సెల్ప్‌ డబ్బా కొట్టుకోవడమేనా..?? చేసిందేమీ లేదా..? ఇక ఉండదా.. ? అనే రేంజ్‌లో అతగాడి ప్రవర్తన మొహం మొత్తించేలా ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నావ్‌.. అంటారా..! వస్తున్నా.

తాజాగా ఓ జర్నలిస్టుపై నోరుపారేసుకున్నాడు అర్వింద్‌. అతగాడు ఇంటర్వ్యూ కోసం సమయం తీసుకున్నాడు. ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఏదో అడిగాడు. చిరాకెత్తింది. ఏయ్‌.. ఏం అడుగుతున్నావ్‌.. అడిగేదేదో కరెక్టు అడుగు అంటూ క్లాస్‌ తీసుకున్నాడు. సీనియర్‌ జర్నలిస్టుకే అర్వింద్‌ పాఠాలు నేర్పింతగా ఎదిగాడన్నమాట ఇందూరు ఎంపీగా. ఇప్పుడు మళ్లీ తనే గెలవబోతున్నానే నెత్తికెక్కిన అహంకారం.. తోటి నేతలతో కార్యకర్తలతో బిహేవ్‌ చేసినట్లుగానే జర్నలిస్టులతో కూడా మాట్లాడితే చెల్లుతుందా..? అందుకే దీన్ని అన్ని మీడియా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. అర్వింద్‌ అహంకారపూరతి వైఖరిని తిట్టిపోశాయి. పోపోవోయ్‌ మేరేమనుకుంటే నాకేందీ.. అని అర్వింద్‌ కనీసం ఆ జర్నలిస్టుకు క్షమాపణ కూడా చెప్పలేదు.

You missed