దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

నిజామాబాద్‌ లోక్‌సభలో ఈసారి ఇద్దరు సీనియర్లు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడూ కొత్తముఖాలే వస్తుంటారు. అదీ జిల్లాకు సంబంధం లేనివారు ఇలా వచ్చి గెలిచి ఆ తరువాత రాజకీయంగా కనుమరుగై పోయినవాళ్లే. ఇప్పుడు ఇక్కడి నుంచి బీఆరెస్‌ తరుపున బాజిరెడ్డి గోవర్దన్‌, కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డిలు పోటీలో ఉన్నారు.

వీరిద్దరికీ కామన్‌గా కలిసి వచ్చే రెండు అంశాలు ఇప్పుడు డిస్కషన్‌కు వస్తున్నాయి. ఇద్దరూ రాజకీయంగా సీనియర్లు. ఇద్దరూ ఓడిన నేతలే. సీనియర్లుగా అధిష్టానం ఇద్దరినీ గుర్తించి టికెట్లిచ్చింది. సింపతీ కూడా దీనికి తోడవుతుందనే భావనలో వీరిద్దరూ ఉన్నారు.

సీనియారిటీ, సింపితీ తమకు గెలుపు మంత్రాలుగా వీరు భావిస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఇతర రాజకీయ కారణాలు, మైలేజీ పాయింట్లు ఉన్నా.. ఇవే ఇద్దరికీ జీవన్‌టోన్‌ టానిక్‌లాగా పనిచేస్తాయని అంచనాలు వేసుకుంటున్నారు. జీవన్‌రెడ్డి అంటే కాంగ్రెస్‌ లీడర్లందరిలో మంచి పేరుంది. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలవాడు. సీనియర్‌ నేతగా అందరూ గౌరవించే నేత.అందరూ తనను గుర్తు పడతారు.

బాజిరెడ్డి కూడా అంతే. ఓటమెరుగని నేతగా, కష్టపడి పైకి అంచెలంచెలుగా ఎదిగివచ్చిన నేత. మాస్‌ లీడర్‌గా పేరు గడించిన నాయకుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బాజిరెడ్డిని గుర్తు పడతారు. మాస్‌ లీడర్‌గా మంచి పేరుంది.

 

You missed