వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌:

పోచారం భాస్కర్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తండ్లాడి ఓడాడు. డీసీసీబీ చైర్మన్‌ పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కుంట రమేశ్‌రెడ్డిపై అన్ని రకాల పోరాటాలు చేశాడు పోచారం. డైరెక్టర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. బెదిరించాడు. కోర్టు మెట్లెక్కాడు. కానీ ఎక్కడా పని కాలేదు.

దీంతో అవిశ్వాస పరీక్షకు పన్నెండు గంటల ముందు రాజీనామా చేశాడు. గురువారం ఉదయం 11 గంటలకు అవిశ్వాస పరీక్ష ఉంది. భాస్కర్‌ రెడ్డి రాజీనామాతో అవిశ్వాస పరీక్ష ఉండదు. టెక్నికల్‌గా వైస్ చైర్మన్‌ను ఇన్ఛార్జి చైర్మన్‌గా ప్రకటిస్తారు అధికారులు. క్యాంపులో ఉన్న డైరెక్టర్లంతా గురువారం ఉదయం 10 గంటల లోపు నిజామాబాద్‌కు చేరుకోనున్నారు.

 

You missed