వాస్తవం ప్రతినిధి- బాన్సువాడ:

బాన్సువాడ కాంగ్రెస్‌లో పదవి చిచ్చు రగిలింది. షబ్బీర్‌ అలీ దీనికి ఆజ్యం పోశాడు. కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ పదవిని ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై బాన్సువాడ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో గాంధీ భవన్‌లో లొల్లి చేయించాడు. తన ఓటమికి ప్రధాన కారణమైన కాసుల బాల్‌రాజు బీఆరెస్‌ నేతలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పోచారం భాస్కర్‌రెడ్డిలతో అంటకాగి పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపించాడు ఏనుగు.

అలాంటి నేతకు షబ్బీర్‌ అలీ పనిగట్టుకుని పదవిని ఎలా ఇప్పించుకుంటాడని భగ్గుమన్నాడు. ఈ వివాదం ఇప్పుడు గాంధీభవన్‌లో ప్రకంపనలు రేపుతోంది. బాన్సవాడ కాంగ్రెస్‌లో కల్లోలం కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడ పూర్తి పట్టుసాధించేందుకు ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రయత్నం చేస్తుండగా.. కాసుల బాల్‌రాజుకు పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోవడం లేదు. షబ్బీర్‌ అలీ కావాలనే పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడని బాహాటంగానే ఏనుగు రవీందర్‌రెడ్డి విమర్శిస్తున్నాడు.

You missed