దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

పోచారం భాస్కర్‌రెడ్డికి పదవీగండం తప్పలేదు. డీసీసీబీ చైర్మన్‌గా అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దీన్నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు కోర్టు మెట్లెక్కినా స్టే ఇవ్వలేదు న్యాయస్థానం. అతను చేసిన ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అయినవి. అలా అవుతాయని అతనికీ తెలుసు. కానీ చూస్తూ చూస్తూ పదవిని ఎలా పోగొట్టుకోవడం.. అందుకే మధ్యలో ఇవన్నీ తండ్లాటలు. కానీ ఏవీ ఫలించలేదు. రేపు ఉదయం 11 గంటలకు అవిశ్వాస పరీక్ష. దీనికి పోచారం భాస్కర్‌రెడ్డి హాజరుకావడం లేదు. దీంతో షరా మామలుగా పదవీచ్యుతుడవుతాడు.

ఓ వైపు జహారాబాద్‌ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించినా అది సఫలం కాకపోవడం, ఉన్న పదవిని కాపాడుకోవడంలో విఫలం కావడంతో యువనేతకు రాజకీయంగా ఇబ్బందులు పడ్డాడు. ఎట్టకేలకు అంతా అనుకున్నట్టుగానే రేపు వైస్‌ చైర్మన్‌గా ఉన్న కుంట రమేశ్‌రెడ్డిని చైర్మన్‌గా ప్రకటించేస్తారు అధికారులు. ఇప్పటి వరకు రమేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదు. ఈ తంతు ముగిసిన తరువాత పార్టీ కండువా కప్పునేందుకు రెడీ అయ్యాడు రమేశ్‌రెడ్డి. కొత్త చైర్మన్‌తో పాటు ఇప్పుడు క్యాంపులో ఉన్న డైరెక్టర్లంతా కాంగ్రెస్‌ గూటి్కి చేరనున్నారు.

You missed