దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్‌లో బీసీ నినాదం బలపడుతోంది. రెడ్ల పెద్దరికం ఎక్కువవుతున్నకొద్దీ ఆ ప్రభుత్వానికి రెడ్ల రాజ్యంగా కళంకం ఏర్పడుతున్నది. మొన్న బట్టి విక్రమార్క విషయంలో జరిగిన అవమానంతో ప్రభుత్వంలో బహుజనులకు ‘పెద్దపీట’ లేదనే విషయంలో మరోసారి రూఢీ అయ్యింది. అప్పటికే చాపకింద నీరులా కాంగ్రెస్‌ పార్టీలో బీసీల ఫైట్‌ నడుస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అభ్యర్థిని విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవు. కాగా కేబినెట్‌ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూపుల నడుమ..ఎంపీ ఎన్నికల తరువాతే ఉంటుందని అధిష్టానం సంకేతాలిచ్చేసింది. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అనూహ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ దక్కడం విశేషం. మంత్రి పదవి కూడా వరిస్తుందని అంతా అనుకున్నారు.

కానీ ఆయన జిల్లాలో సుదర్శన్‌రెడ్డి పెద్ద ఆటకంగా మారాడు. ఇదే ఆఖరి రాజకీయం ఆయనకు. రిటైర్‌మెంట్‌ కాబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా ఆయనకే మంత్రి పదవి ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా బీసీ వర్గాలు అధిష్టానానికి విన్నవిస్తున్నాయి. ఆయన ఔట్‌ డేటెడ్‌ పొలిటిషన్‌. అనుచరగణాన్ని కాపాడుకోలేని నేత. ఇది అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఓ రెడ్డికి, అందులో పార్టీకి పెద్దగా ప్రయోజనం లేని సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఆయనకు మాత్రమే అలంకారప్రాయం తప్పితే ఎవరికీ.. పార్టీకి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదనే భావన బహుజనుల్లో ఉంది.

ఈ క్రమంలోనే బీసీ నేతగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తనకు మంత్రి పదవి కావాలని ఢిల్లీ లెవల్లో లాబీయింగ్‌ చేస్తున్నారు. తొలత మహేశ్‌కు టీపీసీసీ ప్రెసిడెంట్‌ చేయాలని భావించారు. కానీ అది వేరొకరికి ఇచ్చి తనకు మంత్రి పదవి ఇచ్చినా చాలనే విషయాన్ని కూడా మహేశ్‌ అధిష్టానం వద్దకు తీసుకెళ్లాడని తెలిసింది. దీంతో ఇప్పుడు జిల్లాలో మ మంత్రి పదవి నీకా నాకా అనే విధంగా అంతర్గతంగా ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నాయి. బీసీకా రెడ్లకా అనే సామాజిక సమీకరణ కూడా బలంగా తెరమీదకు తీసుకొస్తున్నారు.

You missed