దండగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

బీఆరెస్‌ ఓడినందుకు, ప్రభుత్వం పోయినందుకు బీసీలకు చాన్స్‌ వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ అధినేత ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు. అందులో ఇద్దరూ మున్నూరుకాపులే కావడం గమనార్హం. నిజామాబాద్‌ లోక్‌సభకు బాజిరెడ్డి గోవర్దన్‌, జహీరాబాద్‌కు గాలి అనిల్‌కుమార్‌కు అవకాశం ఇచ్చాడు కేసీఆర్. గాలి అనిల్‌కుమార్‌ గతంలో మెదక పార్లమెంటు నుంచి కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసిన అనుభవం ఉంది. పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన వాడు. పూర్వాశ్రమంలో బీఆరెస్‌తో కలిసి పనిచేసిన వాడే.

ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మున్నూరుకాపుల సంఖ్య అధికంగా ఉండటం కూడా వీరికి కలిసి వచ్చింది. వాస్తవానికి బీఆరెస్‌ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉండే. కేసీఆర్ చివరకు వీరిద్దరి పేర్లను డిసైడ్‌ చేశాడు. అధికారికంగా ప్రకటిండచమే మిగిలుంది. అదే బీఆరెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే బీసీల ముచ్చటే వచ్చేది కాదు. ఓడినందుకే ఇప్పుడు కేసీఆర్‌ బీసీ జపం చేస్తున్నాడమన్నామట. గెలిస్తే వారు ముందుంటారు. ఓడే పరిస్థితి వస్తే ఇలా బీసీలను ముందుకు నెడుతారనేది మరోసారి రూఢీ అయ్యింది.

You missed