దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

మొన్నటిదాకా అది అధికార పార్టీ పత్రిక. నిధులకు కొదవ లేదు. అయినా ఉద్యోగులను తీసేశారు. కరోనా అని కూడా అప్పుడు కొత్తగా వచ్చిన ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి జర్నలిస్టుల జీవితాలను రోడ్డు పాలుచేశాడు. తన అనుచరులను ఆంధ్రజ్యోతి నుంచి సీమాంధ్రులను తీసుకొచ్చి మూడు నాలుగు రెట్ల జీతం ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇంత విధ్వంసం జరిగినా కేటీఆర్‌, కేసీఆర్, కవిత పట్టించుకోలేదు. ఈ నిజాలను నిర్బయంగా రాసిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియా ఎడిటర్‌ దండుగుల శ్రీనివాస్‌పై ఈ ఎడిటర్‌ సైబర్ క్రైం పోలీసులతో కేసు పెట్టించాడు. అప్పుడు బీఆరెస్‌ అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఉన్న ఉద్యోగులను కూడా తీసేస్తున్నారని వార్తలు రాసిన మీడియా పై లీగల్‌ నోటీసులు జారి చేసి మరింత అభాసుపాలైంది నమస్తే తెలంగాణ యాజమాన్యం.

వాస్తవానికి ఈ లీగల్‌ నోటీసుల వ్యవహారం ఎడిటర్‌ పైత్యమే. ఈ పైత్యపు రాతలు, చేష్టల వల్ల ఇప్పటికే కొంప మునిగి ఉన్న నమస్తే తెలంగాణ మేనేజ్‌మెంట్‌కు, కేటీఆర్‌, కేసీఆర్‌లకు తీగుళ్ల మరింత తలనొప్పులు, తలవంపులు తెచ్చిపెట్టాడు. ఇది చాలదంటూ తాజాగా ఓ వార్త వండి వార్చాడు. సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకున్నారు…ముచ్చటించారు… ఫండింగ్‌ ఇవ్వమని చంద్రబాబు అడిగాడు.. అంటూ ఏవేవో వండి వార్చేశాడు. బహుశా ఈ వార్త చూసి తనను కేటీఆర్‌, కేసీఆర్‌ మెచ్చుకుని మెడలేసుకుంటాడని ఊహించి భ్రమించి ఉంటాడు తీగుళ్ల కృష్ణమూర్తి. నిండా మునిగిన నావను లేపేందుకు ఇలాంటి వార్తలు ఎన్ని రాసినా ప్రయోజనం లేదు తీగుళ్ల. ఆ నావ మునగడానికి నువ్వూ ఓ ప్రధాన కారణమే అని వారికీ తెలుసులే.

ఇక సీన్‌ కట్ చేస్తే… నమస్తే తెలంగాణపై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. వాస్తవాలు రాస్తే లీగల్‌ నోటీసులిచ్చి బయపెట్టాలని చూసిన తీగుళ్లకు.. తప్పుడు వార్తలు రాస్తే వాతలు పెడతారని తెలియదేమో ..! లేక ఉన్న ఉద్యోగం కాపాడుకునేందుకు కేటీఆర్‌, కేసీఆర్‌ ప్రాపకం కోసం పాకులాడి ఇలా బుక్కయ్యాడో తెలియదు. కానీ మళ్లీ నమస్తే తెలంగాణ మాత్రం వార్తల్లోకెక్కింది ఇలా.

 

You missed