దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కామారెడ్డిలో అదో అధికారిక కార్యక్రమం.  లీడర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రోగ్రాం కూడా ముగిసింది. అందరూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. కానీ ఈ ప్రోగ్రాంకు సంబంధించిన శిలాఫలకం మాత్రం సోషల్‌ మీడియాలో తెగ గింగిరాలు తిరిగింది. ఆ ఫలకం మీద ఓ పేరే వివాదానికి కారణమైంది. ఆ పేరు షబ్బీర్‌ అలీది. ఆ శిలాఫలకం మీద షబ్బీర్‌ అలీ పేరు కూడా రాయడమే పెద్ద తప్పిదమై పోయింది.

ప్రోటోకాల్‌ ప్రకారం ఆయన పేరు రాయకూడదు కదా..! ఎందుకు రాశారంటూ దీన్ని రాజకీయం చేసేశారు కామారెడ్డి బీజేపీ శ్రేణులు. ఓడిపోయాడని, పారిపోయాడని, ఇదే రాజ్యాంగమని, కలెక్టర్‌ ఇదేం పనితీరని…. ఇలా ఇష్టమొచ్చిన ట్యాగ్‌లైన్లు జోడించి ఆ శిలాఫలకం ఫోటోను జత చేసి నెట్టింట వైరల్ చేసి వదలారు. పాపం..! షబ్బీర్‌ ఇలా కూడా వదలడం లేదు అతన్ని. ముందే పార్లమెంటు ఎన్నికల వేళ. అందునా.. అక్కడున్నది వెంటక రమణారెడ్డి ఎమ్మెల్యే. ఇలా చిన్న చిన్న వాటితో కూడా చెడుగుడు ఆడుకోవడం అతనికి అలవాటే మరి. అందునా అధికారులు ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని ఎదురుచూసే రమయామె. ఇలా శనివారం షబ్బీర్‌ను బుక్‌ చేశారు.

అసలు విషయమేమిటంటే… ప్రోటోకాల్‌ ప్రకారం షబ్బీర్‌ పేరు పెట్టడంలో ఎలాంటి తప్పిదం లేదే..! అని అధికారులు మాత్రం సమర్థించుకుంటున్నారు. ఓడితే ఓడాడు. ఆయన అధికారిక హోదాలో ఉన్నవాడే కాద అని కూడా జవాబిచ్చుకుంటున్నారు. ఆ జవాబు ఎవరికి చెప్పారో తెలియదు కానీ.. షబ్బీర్‌ను మాత్రం ఈ వంకతో సోషల్‌ మీడియాలో దేశమంతా తింపారు.

You missed