దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి:

సీనియర్‌ లీడర్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారు. అంతా అనుకున్నట్టే ఆయనకే అధిష్టానం ఓటేసింది. మొదటి నుంచి జీవన్‌రెడ్డికే చాన్స్‌ వస్తుందనే ప్రచారం ఉంది. నిజామాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు చాలా మందే పోటీలు పడ్డారు. కానీ చివరకు అధిష్టానం జీవన్‌రెడ్డినే ఓకే చేసింది. బీసీ కార్డు కూడా కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చింది. ఈరవత్రి అనిల్, ఆకుల లలిత పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. అరికెల నర్సారెడ్డి, దిల్‌రాజు, నర్సింహారెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. నాకంటే నాకు అనే రీతిలో ఎవరికి వారే ప్రచారం చేసుకున్నారు. కానీ సీనియర్‌ లీడర్‌ వైపే సీఎం రేవంత్‌ మొగ్గు చూపాడు.

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు నిజామాబాద్‌ జిల్లావే. అందుకే ఇక్కడి వారికే అవకాశం ఇవ్వాలని గట్టిగా తమ వాదనను వినిపించారు. కానీ అవేమీ పనిచేయలేదు. బీజేపీ నుంచి అర్వింద్‌ పేరు ఓకే అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా జీవన్‌రెడ్డితో బరిలోకి దిగనుంది. ఇక మిగిలింది బీఆరెస్‌. బాజిరెడ్డే బీఆరెస్‌కు పెద్ద దిక్కుగా మారాడు. ఇదే ఈక్వేషన్లో పోటీ జరిగితే ఇద్దరు బీసీలు ఓ రెడ్డి మధ్య పోటీ ఉంటుంది.

బీసీలలో ఇద్దరూ మున్నూరుకాపులే కావడంతో బాజిరెడ్డి చాలా మటుకు కులం ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది అర్వింద్‌కు పెద్ద దెబ్బే. దీంతో పాటు రెడ్లంతా ఏకమయ్యారు. జీవన్‌రెడ్డికి ఇది ప్లస్‌ పాయింట్‌. ఇద్దరు బీసీలు కొట్లాడుకుని రెడ్డిని అందలం ఎక్కించే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనడంలో అతిశయోక్తి కనిపించడం లేదు.

You missed