దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఒకరిదిమో మితిమీని అధికార అహంకారం…! నాకు తిరుగులేదు. నాకు పోటీయే లేదు. నన్ను మించినోడు లేడు. నా పదవి ఢోకా లేదు. అంతా నేనే. అంతా నాకే. నేనే.. నేనే….!! ఇంకొరిది తనకు తానే మేధాని అని ప్రకటించుకున్న సూడో మేధావి. రాజకీయ అవగాహనలేని కొత్త బిచ్చగాడు. రాష్ట్ర పగ్గాలు చేతికొచ్చాయి కదాని అదే సీఎం పదవి అనుకున్నాడు. అన్ని సెక్షన్లు కలుపుకుపోవడంలో ఘోరంగా ఫెయిలయ్యాడు. తనే కాబోయే సీఎం అని ప్రకటించుకున్నాడు. చివరికి తను పోటీ చేసిన చోట కూడా గెలవలేక చతికిలబడ్దాడు.

ఈ ఇద్దరిని ఓటమి చిత్తు చేసింది. కళ్లు తెరిపించింది. నెత్తి మీద కళ్లు కిందకు దిగేలా చేసింది. ఇద్దరికీ తత్వం బోధపడేలా చేసింది. అహంకారం దింపింది. అధికారం లేకపోతే ఎలా ఉంటుందో రుచి చూపింది. ఆ ఓటమి ఈ ఇద్దరినీ కలిపేలా చేసింది. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనే రీతికి వచ్చారు. కలిసి పోటీ చేస్తే కొంతలో కొంత మెరుగు అని ఇద్దరికీ ఇద్దరు నచ్చజెప్పుకున్నట్టున్నారు. ఇలా కలిసి పొత్తు చేసుకున్నారు.

బీఆరెస్‌ చిత్తుగా ఓడిపోతుందని తెలుసు. మూడో స్థానంలో ఉనికి కోసం తండ్లాడుతున్నవ విషయమూ తెలుసూ. పోటీకి అభ్యర్థులు వెనుకడుగు వేస్తూ పారిపోతున్నారని తెలుసు. ఇంతలో ఎంత మార్పు…? ఎవరు దీనికి కారణం. అదే మితిమీరిన అధికార అహంకారం. తన నీడను కూడా తాకలేని ప్రవీణ్‌తో కలిసి ఇలా పొత్తుల విషయం చర్చించేంత దిగజారిపోయిన వైనం. ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ఉనికే లేని బీఎస్పీ ఇలా ఆర్థిక, అంగ బలం కొంతలో కొంత అవసరమని నగ్నసత్యం తెలుసుకుని దొర కాళ్ల దగ్గరికి పాకులాడుకుంటూ వచ్చిన దివాళకోరుతనం.

ఈ రెండు ఇప్పుడు ఒక్క దగ్గరే కనిపించాయి. మీమిద్దరమూ ఒకటేనని ప్రకటించుకున్నాయి. కలిసి పోరాడుతామని శపథం చేసుకున్నాయి. జనాలతో సంబంధం లేకుండా. వారి అభీష్టంతో మాకేం పని… మా అసవరాలు మావి అనే విధంగా.

 

You missed