దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ దళిత నాయకుడు డీ రాజేశ్వర్‌రావు కాంగ్రెస్‌ గూటికి చేరారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చాలకాలం పాటు ఆయనకు ఎమ్మెల్సీగా కొనసాగిన అనుభవం ఉంది. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా పేరు గడించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్సీగా చేశారు.

ప్రభుత్వాలేవైనా ఆయన పదవికి ఢోకాలేదనే విధంగా కొనసాగారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఫాలోవర్‌గా ఉన్నాడు. జనరల్ ఎన్నికల సమయంలో రాజేశ్వర్‌కు స్టేట్‌ క్రిస్టిషన్‌ మైనార్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ఇప్పించుకున్నాడు ప్రశాంత్‌రెడ్డి. మారిన రాజకీయ పరిస్థితులు, బీఆరెస్‌ పతనావస్థకు చేరుకోవడం గమనించిన రాజేశ్వర్‌ పార్టీకి గుడ్ బై చెప్పక తప్పలేదు.

ఆయన నిజామాబాద్‌ పార్లమెంటుతో పాటు జహీరాబాబద్‌ పార్లెమెంటులో కూడా ప్రభావం చూపగలిగే నేత. దళితులు, క్రిష్టియన్లకు సుపరిచితుడు. అందరివాడిగా పేరుగడించిన రాజేశ్వర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందనే చెప్పాలి.

మార్క్‌ఫెడ్ చైర్మన్‌, అంకాపూర్ వాసి మార గంగారెడ్డి కూడా ప్రశాంత్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు. కానీ పార్టీ వీరినెవరినీ కాపాడుకోలేకపోయింది. త్వరలో మరింత మంది కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు క్యూ కట్టనున్నారు.