పార్టీ మారే ఉద్దేశం లేదు.. ఈ వార్తలో ‘వాస్తవం’ లేదు..
– డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి
వాస్తవం-నిజామాబాద్:
డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం పెడుతున్నారని, తను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం వాస్తవం ప్రతినిధితో మాట్లాడారు. వాస్తవం డిజిటల్ పత్రికలో తనపై వచ్చిన వార్త పూర్తి సత్యదూరమని ఆయన పేర్కొన్నారు. డీసీసీబీ వైస్ చైర్మన్‌గా ఉన్న తనను చైర్మన్ చేసేందుకు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పావులు కదుపుతున్నారని ఆ వార్తలో వచ్చిన కంటెంట్ వాస్తవ దూరంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు తను ఎవరినీ కలిసింది లేదని, ఎవరితో సంప్రదింపులు జరిపిందీ లేదన్నారు. డీసీసీబీ పాలకవర్గం పూర్తికాలం కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు.