దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి:

అధిష్టానం అభ్యర్తులను ప్రకటించేదాక ఆగలేదు వీరిద్దరు. ఎవరికి వారే మా పార్టీ నుంచి నేనంటే.. మా పార్టీ నుంచి నేనని పరోక్షంగా చెప్పేసుకున్నారు. మీడియాకు ఎక్కేశారు. తిట్టేసుకున్నారు. విమర్శలు గుప్పించుకున్నారు. రా చూసుకుందామనే రీతిలో సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. నువ్వో అహంకారివంటే.. నువ్వు సీనియర్‌వునుకున్నా..ఇంత దిగజారుడుతనమా అంటూ ఒకరికొకరు దెప్పిపొడుచుకున్నారు. వారిద్దరు ఎవరంటారా..? ఒకరు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌. మరొకరు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి టికెట్‌ ఇస్తారనే విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రస్తుత తరుణంలో తాజాగా అర్వింద్‌ విడుదల చేసిన ఓ వీడియోతో దాదాపు టికెట్లు వీరికే అనే సిగ్నల్స్‌ ఇచ్చుకున్నారిద్దరు.

జీనవ్‌రెడ్డి తమ్ముడు.. అర్వింద్‌ఓ అహంకారి అంటూ ఉదాహరణలతో కరపత్రాలను విడుదల చేయడం కలకలం రేపింది. దీనిపై అర్వింద్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేశాడు. ఇందులో భాగంగా ఓ వీడియో విడుదల చేశాడు అర్వింద్‌. నేనే పోటీ చేస్తున్నాను.. పోటీకి దిగే సమయంలో నీ కాళ్లకు నమస్కరించి మరీ ప్రచారం మొదలుపెడతాను. అదీ నా సంస్కారం.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చాడు. ఇంకా దీనిపై జీవన్‌రెడ్డి తిరిగి కౌంటర్‌ ఇవ్వకున్నా.. ఆయనే బరిలో నిలబడనున్నాడనే విషయాన్ని ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న విమర్శల పోరు అద్దం పడుతున్నది. బీఆరెస్‌ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. వీరిద్దరు మాత్రం మేమే పోటీలో ఉండబోతున్నామని ఇలా చెప్పకనే చెప్పుకుంటున్నారు.

You missed