దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

అర్వింద్‌ జిల్లా బీజేపీపై తన పట్టు పెంచుకుంటూ పోతున్నాడు. మరోసారి నిజామాబాద్‌ ఎంపీ బరిలో తనే నిలబడే అవకాశం ఉండటంతో ఇప్పట్నుంచే అన్నీ చక్కదిద్దుకుంటున్నాడు. అందులో భాగంగా తన అసమ్మతిగా ఉన్న నేతలకు చెక్‌ పెట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బస్వా లక్ష్మీనర్సయ్యను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. అతని స్థానంలో తన అనుచరుడిగా ముద్ర పడిన సీనియర్‌ నేత పల్లె గంగారెడ్డికి జిల్లా అధ్యక్షుడిని చేయనున్నాడు. దాదాపు ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. నేడో రేపో అధికారికంగా వెల్లడించడమే తరువాయిగా ఉంది. బస్వాకు ఎప్పట్నుంచో చెక్‌ పెట్టాలని అర్వింద్‌ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.

పార్లమెంటు ఎన్నికల వేళ అర్వింద్‌కు ఇదే మంచి తరుణంగా భావించాడు. జిల్లా అధ్యక్షుడిగా చాలా ఏండ్లు పనిచేసిన అనుభవం పల్లె గంగారెడ్డిది. ఆ అనుభవం తనకు పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఆలోచన కూడా అర్వింద్‌కు ఉంది. దీనికి తోడు బస్వాను అధ్యక్షుడిగా కొనసాగిస్తే.. ఎన్నికల్లో తనకు కొరకరాని కొయ్యగా మారుతాడనే భయం అర్వింద్‌ మనసులో బలంగా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌ ఎమ్మెల్యేగా గెలిచిన ధన్‌పాల్‌కు బస్వా ఏ మాత్రం సహకరించలేదు. ఇది పార్టీలో చర్చకు వచ్చింది. ఇక బస్వాను తప్పించడమే పనిగా పెట్టుకున్న అర్వింద్‌ మొత్తానికి తన వ్యూహాన్ని చాకచక్యంగా అమలు చేయడంలో సఫలీకృతులయ్యాడు.

You missed