రెండు సార్లు అధికారం ఇచ్చారు. మూడోసారి మార్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నయ్‌.. సిట్టింగులను తలకెత్తుకుంటే వారే కొంప ముంచారు. ఓటమి తథ్యమని పదుల సార్లు చేపించుకున్న సర్వేలే చెప్పినా వారిని మార్చే ధైర్యం చేయలే. లేకపోతే ఎలాగైన చేసి గెలుస్తామని భ్రమల్లో మునిగి తేలారు. ఓటమిని ఒప్పుకోవడం హుందాతనం. తప్పులెన్నువాడు తన తప్పులెరుగడు అన్నట్టు ఇప్పుడు కేటీఆర్‌ చేస్తుందదే. సీఎం రేవంత్‌ రెడ్డి అన్నట్టు.. విత్‌డ్రాల్‌ సిండ్రోమ్‌ కేటీఆర్‌ను వెంటాడుతున్నట్టుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అట్టర్‌ ఫ్లాప్‌ అయిన కేటీఆర్‌.. తమ అసమర్థతను, లోపాలను అంగీకరించడం లేదు. కనీసం ఆత్మ పరిశీలనైనా చేసుకుంటున్నాడా..? అంటే అదీ డౌటే అనిపిస్తుంది. ఇలాంటి వార్తలు చూసినంక.

32 యూట్యూబ్‌ చానళ్లు పెట్టుకుని ఉండాల్సిందంట. అయితే గెలిచేవారట. అంటే మీ లోపమేమీ లేదన్నమాట. ప్రజలే ఆ యూబ్యూట్‌ చానళ్లు చూసి చెడిపోయారన్నమాట. మిమ్మల్ని ఘోరంగా అపార్థం చేసుకున్నారన్నమాట. వాళ్లు చెప్పిందే నమ్మేశారన్నమాట. ఉన్నవి లేనవి కల్పించి చెప్పగానే మీమీద విపరీతమైన ద్వేషం, కోపం అనవసరంగా పెంచుకున్నారన్నమాట. కేటీఆర్‌ మాటల్లో ఫ్రస్టేషన్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మెడికల్‌ కాలేజీల బదులు చానళ్లు పెట్టుకుంటే బాగుండు.. అంటే ఎంత వెటకారం. ఇవి అహంబావపు మాటలే. ప్రజలు కన్‌ఫ్యూజ్‌ కావడం వల్ల బీఆరెస్‌ ఓడిపోయిందట.. ఎమ్మెల్సీ కవిత కామెంట్లో కూడా ఏ మాత్రం మెచ్యూరిటీ లేదు. తప్పులను ఒప్పుకోకుండా.. వాటిని సరిదిద్దుకోకుండా.. ప్రజల వద్దకు వెళ్లి వారిలో నిండి వున్న వ్యతిరేకతను దూరం చేసుకోకుండా.. ప్రజలనే కించపరిచేలా, ప్రజాతీర్పునే హేళన చేసేలా మాట్లాడటం వీరికే చెల్లింది. ఇలా అయితే కష్టమే.

రాను రాను రాజు గుర్రం గాడిదైందట.. అప్పుడప్పుడు కేటీఆర్‌ మాటలు అట్లనే అనిపిస్తాయి. ఎంతో హుందాగా ఉందామనుకుంటాడు. కానీ ఇలా నోరు జారుతూ పలుచన అవుతాడు. మీ వైఖరి మార్చుకోకపోతే కాంగ్రెస్‌ లోపాలు ప్రజలు గుర్తించినా ఈజీగా వారిని కొన్నేండ్లు క్షమించేస్తారు. కానీ మీ వైపు మాత్రం సింపతీ చూపరు. ఇదీ మీరు గమనించాల్సింది. యూ ట్యూబ్ చానళ్లు పెట్టుకోనవసరం లేదు. అవునూ… మరి మన నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ను ఎవరూ పట్టించుకోలేదంటారా..? . మీరు వాటిని పట్టించుకుంటే కదా.. జనాలకు అవి ఎప్పుడో దూరమయ్యాయి. మీ రాజకీయాల్లాగే. మీ మనస్తత్వాల్లాగే..

You missed