దండుగుల శ్రీనివాస్‌, వాస్తవం ప్రతినిధి:

మహేశ్‌కుమార్‌ గౌడ్‌, విధేయతకు మారుపేరు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీ నేత. పద్దెనిమిదేండ్లుగా పార్టీలో వివిధ స్థాయిలో సేవలందించిన లీడర్‌. పార్టీ ఏ పదవి ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసుకుంటూ వచ్చిన నాయకుడు. నిలకడ మనస్తత్వం. కమిట్‌మెంట్ దోరణి. పార్టీ విధేయతకు కట్టుబడే మెంటాలిటీ. కష్టకాలంలో కూడా పార్టీని వదలని, సిద్దాంతం వీడని కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. అతనికి కీలక పదవి దక్కనుంది. అర్బన్‌ నుంచి పోటీ చేద్దామనుకున్న మహేశ్‌ను అధిష్టానం వద్దంది. సైలెంట్‌గా ఉన్నాడు. పార్టీ సమీకరణల మధ్య షబ్బీర్‌ను అర్బన్‌ కు పంపితే ఆయన గెలుపు కోసం తనవంతు శాయశక్తుల కృషి చేశాడు.

ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఓ సామన్య కార్యకర్త నుంచి పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్తాయికి వెళ్లిన మహేశ్‌..పీసీసీ చీఫ్‌ పదవిని అందిపుచ్చుకోవడానికి ఆమడదూరంలో ఉన్నాడు. ఇదేమంతా మామూలు, చిన్న విషయం కాదు. ఢిల్లీ పెద్దలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు నెరుపుతున్న మహేశ్‌కు ఈ పదవిని అలంకరించడానికి రూట్లన్నీ క్లియర్‌గా ఉన్నాయి. వేర్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న మహేశ్‌కు పార్టీ విధేయుడనే మంచిపేరుంది. అదొక్కటే ఇప్పుడు అతన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టే.. కీలక పదవికి దగ్గర చేసే మార్గానికి రూట్ క్లియర్‌ చేస్తోంది.

ఇందూరు నుంచి డీఎస్‌ పీసీసీ చీఫ్‌గా చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ తర్వాత జిల్లా నుంచి చెప్పుకోదగ్గ బీసీ నేత ఎవరూ రాష్ట్ర స్థాయిలో ఎదగలేదు. మనలేరు. ఇప్పుడు మహేశ్‌ వంతు వచ్చింది. మొన్నటి వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌ సీఎం కావడంతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్‌ పదవి ఇప్పుడు మహేశ్‌ కోసం ఎదురుచూస్తోంది. ఆ పదవి తనకే వరిస్తుందనే ధీమాలో మహేశూ ఉన్నాడు.

You missed