జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుజీత్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రామడగు బాల కిషన్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు (ఎంపి) ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ వారికి నియామక ఉత్తర్వులు అందించారు. బీసీల హక్కులు, డిమాండ్ల సాధనకు కృషి చేయాలని సూచించారు. బీసీల ఉద్యమ పోరాటంలో సంఘం జాతీయ, రాష్ట్ర కమిటీలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. చట్ట సభల్లో, మహిళ రిజర్వేషన్లలో, ప్రభుత్వ పథకాల్లో, రాజకీయ ప్రాతినిథ్యంలో, వివిధ పార్టీ పదవుల్లో, ఉద్యోగాల కల్పనలో, పదోన్నతుల్లో సముచిత స్థానం దక్కే వరకు అలుపెరుగని పోరాటం చేయాలన్నారు.

త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో బీసీ గర్జన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే సుజీత్ సింగ్ ఠాకూర్ బొందిలి రాజ్ పూత్ సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రామడుగు బాల కిషన్ ఇప్పటికే బీసీ సంఘం నిజామాబాద్ నగర అధ్యక్షునిగా, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులుగా సేవలు అందిస్తున్నారు. బీసీలకు వీరు చేస్తున్న సేవలను గుర్తించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణలు సంఘం కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు. వీరివురి నియామకం పట్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.

You missed