మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆమె కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉంటూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కన్నుమూశారు. దాదాపు ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూ ఉండటంతో, కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆమె ఆరోగ్యం కోసం క్షణ క్షణం పరితపించారు.