ఈ ఇద్దరూ ఇద్దరే. మాస్ లీడర్లు. నమ్ముకున్న వారికి నేనున్నానే భరోసా నింపుతారు. చివరికంటా వెంటుంటారు. వెన్నంటి ఉంటారు. పంతం పడితే అది సాధించేదాకా వదలరు. దేనిని వెరువరు. వెన్నుచూపరు. వెనుకడుగు వేయరు. చాలా మీటింగులలో ఎమ్మెల్సీ కవిత… బాజిరెడ్డి గోవర్దన్‌ను రౌడ్ బ్యాచ్ అని సంబోధిస్తారు. తను కూడా ఆ బ్యాచేనంటూ తనకు తను చెప్పుకుంటుంటారు. ఈ మధ్య గోవన్నను జిల్లా పెద్దన్నగా సంబోధిస్తున్నారు కవిత. అంతే కాదు.. ఆర్టీసీ చైర్మన్ అడుగు పెట్టిన సందర్బంగా కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులయ్యారని, అందుకే అతనిది గోల్డెన్ లెగ్ అని, లక్ష్మీపుత్రుడని కూడా సంబోధిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ పై లోక్‌సభ ఆమోదం తరువాత ఆమె దీని వెనుక చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేస్తూ ఇవాళ ఆయన ఆమెతో ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. వీరిద్దరి ముచ్చట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.