వేల్పూర్:
ఈనెల 12న బాల్కొండ నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
బుధవారం జాబ్ మేళాకు సంబందించిన అంశాలను ప్రెస్ మీట్ నిర్వహించి వివరించారు.
సెప్టెంబర్ 12వ తేదీన బాల్కొండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ,యువకుల కోసం వేల్పూర్ మండలం లక్కోర ఏఎన్జి ఫంక్షన్ హాల్లో తన టీం, ఆసరా ఫౌండేషన్ సౌజన్యంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా క్యూర్ కోడ్ విడుదల చేశామని,దాన్ని స్కాన్ చేసి జాబ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉద్యోగార్థులకు, ఆశావాహులైన యువతకు సూచించారు.
ఈ జాబ్ మేళాలో 70కి పైగా కంపెనీలు.. ఐటి – సాప్ట్వేర్, నాన్ ఐటీ,బ్యాంకింగ్,ఫార్మా,టెక్నికల్, కోర్ జాబ్స్,మ్యానుఫ్యాక్చరింగ్,హోటల్ మేనేజ్మెంట్,నర్సింగ్/హాస్పిటల్,మార్కెటింగ్,లాజిస్టిక్స్,బిపిఒ/కెపిఓ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన సంస్థలు పాల్గొంటాయనీ వివరించారు.
పదవతరగతి,ఐటిఐ,డిప్లొమా,డిగ్రీ,ఎంబీఏ,బి.టెక్,ఎంసిఏ,ఫార్మసీ,హోటల్ మేనేజ్మెంట్ వివిధ కోర్సులు చదివి ఉద్యోగ అన్వేషణలో ఉన్న బాల్కొండ నియోజకవర్గ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వారి ప్రతిభను కనబర్చి ఎంపికైన అభ్యర్థులకు వారి సామర్ధ్యం బట్టి ఆయా కంపెనీలు నెలకు 12వేల నుండి 60వేల వరకు జీతం ఇస్తాయని అన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన కంపెనీ నుండి అదేరోజు అపాయింట్మెంట్ లెటర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. 12వేల నుంచి 14వేల తక్కువ జీతం ఉన్న వారికి ఆయా ఎంపిక చేసుకున్న కంపెనీలు భోజన వసతి సదుపాయం ఏర్పాటు చేస్తాయని అన్నారు.
బాల్కొండ నియోజకవర్గ యువతకు 4వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామని,భవిష్యత్ లో కూడా అందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సదావకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి తల్లితండ్రులు కూడా ఇందుకు సహకరించి, ప్రోత్సహించాలని సూచించారు.
ఈనెల 12న ఉదయం 10 గంటల వరకు ఆశావహులు లక్కోర ఏఎన్జి ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవాలని,ఆయా కంపెనీలు ఇంటర్వ్యూ కు హాజరయ్యే అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని అన్నారు. జాబ్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల స్టాళ్ళలో ఎవరి విద్యార్హతకు తగిన జాబ్/ కంపెనీ ఉద్యోగానికి వారు అటెండ్ కావొచ్చని అన్నారు.