నిజామాబాదు రూరల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం పై బీఅరెస్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రూరల్ క్యాంపు కార్యాలయం ముందు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని నోరు తీపి చేసుకున్నారు. మాస్ లీడర్ గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న గోవన్న పై అధిష్టానానికి అపారమైన నమ్మకం, గౌరవం ఉందని, అదేస్థాయిలో ఆయనకు భారీ మెజారిటీ అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి గోవర్ధన్ క్యాంపు కార్యాలయం లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమానం తో గోవన్న ను ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో

నుడా చైర్మన్‌ ఈగ సంజీవ్ రెడ్డి, డీసీఎంస్‌ ఉమ్మడి నిజామాబాదు జిల్లా చైర్మన్ సాంబారు మోహన్, బాజిరెడ్డి జగన్‌, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్‌ నాయక్‌, పార్టీ అధ్యక్షుడు చిలివేరు దాసు, వైస్‌ ఎంపీపీ అంజయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ బోర్గాం శేఖర్‌రెడ్డి, చైర్మన్‌ రాజారెడ్డి, చింతలపల్లి గోవర్దన్‌ రెడ్డి, ధర్పల్లి రాజ్‌పల్లి రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, సర్పంచుల ఫోరమ్ ఇందల్వాయి అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీటీసీ ఇందల్వవాయి చింతలదాస్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పాశం కుమార్‌, నుడా డైరెక్టర్‌ అభిలాష్‌రెడ్డి, చంద్రయాన్‌పల్లి సర్పంచి, సర్పంచ్ అంబర్‌ సింగ్‌, పార్టీ అధ్యక్షులు, అభిమానులు, సీనియర్ నాయకులు భారీ ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు…..

You missed