కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆపేసి చాలా ఏండ్లయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేడో రేపో కొత్తవి అప్లికేషన్‌ పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. కొందరైతే సోషల్‌ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సర్కార్‌ కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేస్తుందహో అని ఊదరగొట్టేశారు. దీంతో శనివారం ఉదయం నుంచి అంతటా ఇదే చర్చ. అధికారులకు కూడా ఇదో తలనొప్పిగా మారిపోయింది. దీంతో ప్రభుత్వమే జోక్యం చేసుకుని సంబంధిత మంత్రితో ఇదంతా ఉత్తదేననే ప్రకటన ఇప్పించేవరకు వెళ్లింది. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జనానికి ఇంకా ఎదురుచూపులు తప్పలేదని అర్థమయిపోయింది.

అయితే ఎన్నికలు ఇంకా ఎన్నో రోజులు లేనందున కొంత ఆలస్యమైనా కొత్త రేషన్‌కార్డులు ఇస్తారని, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించేందుకు పోర్టల్‌ ఓపెన్ చేస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత రేషన్‌కార్డులు జారీ చేసినా అవి కార్డుల రూపంలో రాలేదు. కార్డులు ముద్రించలేదు. ఆధార్‌ నెంబర్‌, రేషన్‌ కార్డు నెంబర్‌ ఆధారంగానే రేషన్‌ తీసుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు కార్డుల ముద్రణ ప్రక్రియ జరుగుందని భావించినా.. వాటిని పెండింగ్‌లో పెట్టేశారు. ఆ తరువాత వాటి జోలికి వెళ్లలేదు. గతంలో రేషన్‌కార్డులు ఉండేవి. వాటకి లామినేషన్‌ చేసి మరీ, ఇంటి కుటుంబసభ్యలు ఫోటోలతో ప్రచురించి ఉండేవి.

తెలంగాణలో ఆ అవకాశామే లేకుండా పోయింది. ఇప్పటికే రేషన్‌ ప్రింట్‌ పేపర్‌ తీసుకుని రేషన్‌దుకాణాలకు వెళ్తున్నారు. ఇక ఇప్పట్లో కార్డుల ముద్రణ కూడా ఏమీ ఉండదు. ప్రభుత్వం మళ్లీ ఏర్పాటయిన తర్వాతే ఈ ముచ్చట. ఆలోగా పోర్టల్ ఓపెన్ చేస్తే కొత్తవారు, అర్హులైన వారు అప్ల చేసుకునే వీలుంది. చాలా మంది చనిపోయారు. వాటినీ తొలగించలేదు. కొత్త పేర్లు ఎక్కలేదు. ఇవన్నీ పోర్టల్‌ ఓపెన్‌ చేస్తేనే సాధ్యమవుంది. దీనికి మరికొంతకాలం పట్టేలా ఉంది. అప్పటి వరకు నిరీక్షణ తప్పదు.

You missed