ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ది గోల్డెన్‌ లెగ్ అని సంబోధించారు ఎమ్మెల్సీ కవిత. సోమవారం ఐటీ హబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ కామెంట్‌ చేశారు.

బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం శుభసూచకమని, కార్మికుల కష్టాలు తొలిగి వారి కటుంబాల్లో వెలుగులు నిండుతాయని ఆమె అన్నారు. బాజిరెడ్డిది గోల్డెన్‌ లెగ్ అంటూనే ఆయనను ఇకపై లక్ష్మీ పుత్రుడు అని పిలవాలి అంటూ వ్యాఖ్యానించారు.

You missed