శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. 8400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8400 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 1091 అడుగుల నీటిమట్టం, 90.313 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి కాకతీయ ప్రధాన కాలువకు, జె నకోకు 2500 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్లు, జెన్కోకు 5500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

లక్ష్మీ కాల్వకు 100 క్యూసెక్కులు , సరస్వతీ కాలువకు 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. గత సంవత్సరం ఇదే రోజున ఉదయం ప్రాజెక్టులో 1087.70 అడుగుల నీటిమట్టం 75.465 టీఎంసీల నీటి నిలువ ఉంది మంగళవారం మధ్యాహ్నం కాకతీయ కాలువకు నీటి విడుదలను మెండోరా ఎంపీపీ సుకన్య కమలాకర్, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు.

You missed