శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. బుధవారం రాత్రి ఎగువ మహారాష్ట్ర నుండి గోదావరి తీరంలో కురిసిన వర్షాలు తో ఇన్ఫ్లోలు 1,596 వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి లక్షన్నర క్యూసెక్కులు దాటి పెరుగుతుండడంతో గురువారం మధ్యాహ్నం మొదట 26 క్రష్టు గేట్లు ఎత్తి వరద జలాలను దిగువకు గోదావరి నదిలోకి వదలడం ప్రారంభించారు. ఇన్ ఫ్లో 2 లక్షల 42 వేల క్యూసెక్కులకు పెరగడంతో సాయంత్రం 30 గేట్లను ఎత్తి లక్ష 75 వేలకు క్యూసెక్కుల జలాలను, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కుల జలాలను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
ఎస్ ఆర్ ఎస్ పి పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90.3 టి ఎంసిలు కాగా గురు వారం సాయంత్రానికి 1088 అడుగుల నీటిమట్టం , 78.342 టీఎంసీల నీటి నిల్వకు ప్రాజెక్టు చేరుకుంది. గత సంవత్సరం ఇదే రోజున ప్రాజెక్టులో 1087 అడుగుల నీటిమట్టం 75.146 టీఎంసీల నీటి నిలువ ఉంది.