కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ఆదివారం నిర్వహించిన మెగాజాబ్‌ మేళాకు అనూహ్య స్పందన లభించింది. హైదరాబాద్‌లోని వివిధ రంగాలకు చెందిన 68 కంపెనీలతో మాట్లాడి కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగాజాబ్‌ మేళాను ఆయన ఏర్పాటు చేయించారు. కామారెడ్డి నియోజకవర్గ యువతకు హైదరాబాద్‌ నగరంలో పెద్ద పెద్ద కంపెనీలలో జాబ్‌లు ఇప్పించడమే ధ్యేయంగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు.

దీనికి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 475 మంది నిరుద్యోగులకు ఈ కంపెనీల ద్వారా ఉపాధి అవకాశాలు లభించాయి. వారెంతో హర్షం వ్యక్తం చేశారు. పేరున్న ప్రముఖ కంపెనీలలో తమకు ఉద్యోగం దొరకడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వీరంతా ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగులే కాకుండా కొంత మంది ఆర్మూర్, నిజామాబాద్‌ నుంచి వచ్చిన యువతకు కూడా ఉద్యోగాలు దొరికాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉన్నత చదవులు చదివి సరైన ఉపాధి అకవాశాలు లేని వారి కోసం ప్రత్యేకంగా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలిప్పించాలనే లక్ష్యంతో ఈ మెగాజాబ్‌ మేళాను ఏర్పాటు చేయించానని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలతో మాట్లాడి జాబ్‌మేళాలలను ఏర్పాటు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా బీరెఆస్‌ అధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

You missed