మొన్న రైతు డిక్లరేషన్‌.. బాగానే ఉంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం. ఇప్పుడు యూత్‌ డిక్లరేషన్‌. కీలకమైన నిర్ణయాలు. నిరుద్యోగులు ఏ విధంగా సఫర్‌ అవుతున్నారో.. వారికేం కావాలో తెలుసుకుని బాగా ఆకట్టుకునే రీతిలో, వారిని ఆదుకునే పంథాలో మంచి నిర్ణయాలు ప్రకటించింది కాంగ్రెస్‌. నిరుద్యోగ భృతి చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీన్నే అందిపుచ్చుకున్నది కాంగ్రెస్‌. యూత్‌ డిక్లరేషన్‌లో ఇదే హైలెట్‌.

నాలుగు వేల జీవన భృతి ఇస్తామని ప్రకటించారు. దీన్ని కాదని బీఆరెస్‌ రేపు ఎక్కువ జీవన భృతి ఇస్తామని ప్రకటించినా జనాలు నమ్మరు. ఈ విషయంలో కాంగ్రెస్‌ హామీ యువతపై తారక మంత్రంలా పనిచేయనుంది. దీంతో పాటు పది లక్షల రుణాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్‌ క్యాలెండర్ ప్రకటన… ఇవన్నీ కూడా యువతకు ఎంతో ఊరటనిచ్చేవే. వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల నియామకాల విషయంలో యువత, నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు.

దీనికి తోడు లీకేజీ వ్యవహారాలు… వారిని మానసికంగా దెబ్బ తీశాయి. సరైన సమయంలో కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం యూత్ డిక్లరేషన్‌ పేరుతో కీలన నిర్ణయాలు ప్రకటించడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. దీన్ని ఇటు బీజేపీ, బీఆరెస్‌లు కూడా అందుకోలేవు. ఇంతకు మించి అని ప్రకటించినా నమ్మే పరిస్థితుల్లో యువత లేదు.

You missed