అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం
తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం..
నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి
రూరల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న
తడిచిన ధాన్యాన్ని సేకరిస్తాం… ఎవరూ దిగులు చెందొద్దు.. కేసీఆర్ రైతు పక్షపాతి.. ఎకరాకు పదివేల పరిహారం వచ్చేలా సీఎంతో మాట్లాడుతా… ధైర్యంగా ఉండండి..
రైతులకు వెన్నుదన్నుగా బాజిరెడ్డి పంట నష్ట పరిశీలన.. భరోసా.
నిజామాబాద్ ప్రతినిధి: వాస్తవం
వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా ఉరుములు,పిడుగులతో , ఈదురుగాలులతో ఏకధాటిగా కురిసిన వడగండ్ల వానలకు రైతుల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అన్నదాత పరిస్థితి ఆగమాగమయ్యింది. చేలో పంటలు నేలకొరిగాయి. కోతలు ముగించుకుని ధాన్యాన్ని కేంద్రాలకు పంపాలని ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటలు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రెవెన్యూ అధికారులు సర్వేలు చేసి అంచనాలు రూపొందిస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయి నివేదిక రానున్నది.
కాగా బుధవారం ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మోల్యే బాజిరెడ్డి గోవర్దన్ పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు , రైతులను పరామర్శించి నేనున్నానంటూ భరోసా నింపేందుకు పంటబాట పట్టారు. డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అకాల వర్షానికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రైతులు లబోదిబోమంటున్నారు. వెంటనే బాజిరెడ్డి రైతుల వద్దకు వెళ్లి పరామర్శించారు. పంట నష్టాన్ని అంచనా వేశారు. పంట పొలాల్లో ఖాళీ బాటన కలియతిరిగి నష్టపోయిన ప్రతీ రైతుతో మాట్లాడి నష్టం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారికి నేనున్నానంటూ భరోసా నిచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లతో మాట్లాడి ప్రతీ గింజ కొనేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. రైతన్నలో భరోసా నింపారు. నేనున్నాననే ధైర్యం కల్పించారు. ఆందోళన వద్దని, పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టం పరిశీలన చేసేందుకు బాజిరెడ్డి గోవర్దన్ తో పాటు యువనేత, జిల్లా ఒలంపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఎంపీపీలు ,జడ్పీటీసీలు పాల్గొన్నారు.
తడిచిన గింజలను కొంటాం.. ఏమాత్రం అధైర్యపడకండి.. ఆందోళన చెందకండి.. నేనున్నాను: బాజిరెడ్డి
పంటల నష్టాన్ని స్వయంగా పర్యటించి పరిశీలించిన బాజిరెడ్డి గోవర్దన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. నేనున్నానంటూ భరోసా నింపారు. ఆయన ఏమన్నారంటే..
ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు, వడగండ్ల వానలకు రూరల్ నియోజకవర్గంలో పంటలు బాగా దెబ్బతిన్నాయి. డిచ్‌పల్లి మండలంలోని సుద్దులం, కోరట్‌పల్లి, కోరట్‌పల్లి తాండా, ధర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ రూరల్… ఈ నాలుగు మండలాల పరిధిలో అకాల వడగండ్ల వానాలతో వరి బాగా దెబ్బతిన్నది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.డిచ్‌పల్లి మండలంలోని మూడు గ్రామాలలోని 800 ఎకరాల మేర పంట నష్టపోయింది. 80 శాతం దెబ్బతిన్నది. 20 శాతం మాత్రమే బాగున్నది. వీటిని రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌కు పరిస్థితి వివరించి .. రైతులకు పరిహారం ఇప్పిస్తాం. రైతులు ఏమాత్రం దిగులు చెందకండి. నేనున్నాను. కేసీఆర్‌తో మాట్లాడి పరిహారం కచ్చితంగా వచ్చేలా కృషి చేస్తాను. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి, తప్పకుండా రైతాంగాన్ని ఆదుకుంటారు. ఎకరాలకు పదివేల రూపాయల పరిహారం అందేలా చూస్తాం. నోడికాడికొచ్చిన పంట వర్షార్పణ కావడం చాలా దుదదృష్టకరం. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. ప్రభుత్వం మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటుంది. ఇది ప్రకృతి విలయం… వేరే విధంగా భావించకుండా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్రాప్ డ్యామేజీ జరిగింది. వారికి కూడా న్యాయం చేస్తాం. తడిచిన ధాన్యాన్ని పారాబాయిల్డ్ మిల్లులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ ఆందోళన పడొద్దు. కొంచెం ఓపికతో ఉండండి.
- ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మోల్యే బాజిరెడ్డి గోవర్దన్