మంత్రి ప్రశాంత్‌రెడ్డి లాంటి లీడర్‌ను తనింత వరకు చూడలేదన్నాడావృద్ధుడు. డెవలప్‌మెంట్‌ పనులు ఇంతలా ఇప్పటి వరకు చేసిందెవ్వరూ లేరని, అది వేములతోనే సాధ్యమయ్యిందని కొనియాడాడు. మంత్రి పనితీరు పట్ల ప్రశంసల జల్లు కురిపించాడా వయోవృద్ధుడు. స్టేజీపైకి వచ్చి మరీ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, మంత్రి పనితీరుపై స్వయంగా వచ్చి మాట్లాడిన ఆ వృద్ధుడు మాటలకు అంతా ఫిదా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

“బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామానికి చెందిన దేవన్న అనే 100 ఏళ్లు నిండిన వృద్దుడు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. తన జీవితంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసిన, వాల్లు ఓట్లు అడిగేటప్పుడు కనిపించే వారు. అభివృద్ది పనుల గురించి అడిగితే కాళ్ళు అరిగేలా తిప్పించుకునే వాళ్లు. కేసిఆర్ లెక్క రైతులకు కరెంట్ ఇచ్చి,రైతు కోసం ఇంత చేసిన మొనగాడు ఎవరు లేరని,ప్రశాంత్ రెడ్డి లాగా ఇంతకు ముందు ఎవరు బాల్కొండ లో ఎవరు అభివృద్ది చేయలేదని,మన కోసం పనిచేసే ప్రశాంత్ రెడ్డికే ఓటు వేసి గెలిపించుకోవాలి.” అని ఆయన సభలో అన్నారు.

You missed