మునుగోడు ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అన‌గానే …ఉద‌యం నుంచి టీవీల‌క‌తుక్కుపోయారంతా. వాస్త‌వంగా ఎగ్జిట్ పోల్స్‌లో టీఆరెస్ గెలుస్తుంద‌ని తేలింది కాబ‌ట్టి….. అధికార పార్టీ టీవీ చాన‌ల్ టీ న్యూస్‌లో అయితే క‌రెక్టుగా ఇస్తార‌నుకుని అంతా దాని వైపు చూశారు. టీఆరెస్ వాళ్లు కాకుండా వేరే వాళ్లు కూడా. కానీ అత్యంత పూర్ లైవ్‌.. పూర్ క‌వ‌రేజీ టీ న్యూస్‌దే. అక్క‌డ రౌండ్ల వారీగా లెక్కింపు వివ‌రాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇక్క‌డ మాత్రం అక్క‌డే ఆగిపోయింది. వాస్తవంగా తొలి రౌండు నుంచి మూడు నాలుగు రౌండ్ల వ‌ర‌కు బీజేపీ హ‌వా క‌నిపించింది.

ఇది పాపం జీర్ణించుకోలేక‌పోయిందేమో టీ న్యూస్‌. టీవీ 9 మాత్రం ముందుంది. ఎప్ప‌టిక‌ప్పుడు రౌండ్ల వారీగా ఇస్తూనే లీడ్ కూడా ఇస్తున్న‌ది. ఆధిక్యం, వెనుకంజ అంటూ అభ్య‌ర్థుల ఫోటోల‌తో గుర్తుల‌తో ఇచ్చేస్తూనే ఉంది. బీజేపీ పార్టీ టీవీ చాన‌ల్ వీ6ను ఈ క‌వ‌రేజీ విష‌యంలో మెచ్చుకోవాలి. వాస్త‌వ రిపోర్టునే ఇచ్చింది. లైవ్ క‌వ‌రేజీకి స‌మ న్యాయం చేసింది. లైవ్‌లో అంద‌రితో మాట్లాడించింది. ఆఖ‌రికి టీఆరెస్ గెలిచిన త‌ర్వాత కేటీఆర్ ప్రెస్‌మీట్‌నూ లైవ్‌గా ఇచ్చేసింది. ఇంత పార‌ద‌ర్శ‌క‌త టీ న్యూస్‌కు చాత‌కాలేదు. అందుకే ఈ ఉప ఎన్నిక రిజ‌ల్ట్‌ను చూసేందుకు టీ న్యూస్ వైపు వెళ్ల‌లేదు ఎవ్వ‌రు. టీవీ9, ఆ త‌ర్వాత వీ6 చాన‌ల్‌ను చాలా మంది వీక్షించారు.

You missed