మునుగోడు ఓటర్ గుంబానంగా ఉన్నడు… అడా మగ ఎవ్వరిని కదిలించినా స్పష్టంగా సమాధానం చెప్పలేదు..ఎందుకు మా అభిప్రాయం చెప్పాలి… చెబితే ఏమవుతుందో అనే భావన చాలా మంది ఓటర్ల లో కనపడింది,కొంత ఎక్కువ సమయం తీసుకుని రాజకీయాలు కాకుండా ఇతర విషయాలు మాట్లాడి కొంతసేపటి తర్వాత రాజకీయం గురించి మాట్లాడితే కొందరు తెరాస పధకాలు..రైతుబంధు, పెన్షన్స్, కల్యాణ లక్ష్మి లాంటి పధకాలు బాగా పనిచేశాయని అన్నారు.. జనగామ తండా లాంటి కొన్ని తాండల్లో ఇంటిపైన తెరాస జెండా కట్టినామాని అన్నారు.. నిబంధనల ప్రకారం ఆలా చేయవద్దని చెబితే తీసేసా మన్నారు… రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో రోడ్లు మంచిగా అయినాయని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కొందరు అన్నారు….

ఒక ఊర్లో మాత్రం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రాజగోపాల్ రెడ్డి మీద కొంత గట్టిగానే మాట్లాడారు… రాజీనామా చేసినోడు ఇండిపెండెంట్ పోటీ చేసి బీజేపీ లో కలిసేదుoడే… అన్నం పెట్టిన కాంగ్రెస్ ని వదిలి పెట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ను తిడుతాడా మే ము అస్సలు ఆయనకు ఓటు వేయను అన్నరు . బహుశా వాళ్లు కాంగ్రెస్ వీర అభిమానులు లేదా కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యి ఉంటారు.. మరో ఇద్దరినీ కదిలిస్తే ఎవ్వరు ఎక్కువ పైసలిస్తే వాళ్ళకే ఓటేస్తామని కుండబద్దలు కొట్టారు… సో.. ఓటరు చాలా అప్రమత్తం గా ఉన్నారు…. తమపని చేసుకున్నట్టు చేస్తూ అన్ని గమనిస్తున్నారు…తెరాస, బీజేపీ మధ్యనే పోటీ… ఇప్పటికి అయితే తెరాస కొంత ముందున్నది..పేపర్స్, టివి ల్లో కనిపించేంత హడావిడి అక్కడ లేదు…కని చివరి మూడు రోజులే కీలకం అనిపించింది .

Venkata Ramana Rao Nellutla

You missed