గాడ్ ఫాదర్ చూసాను ఈ రోజు.చెప్పడానికి ఏమీ లేదు.తెలిసిన లూసిఫర్ కథను,బాగా తెలిసిన చిరంజీవి నటనను మరచినట్లు నటించి తెల్లమొహం వేసుకుని చూడడానికి మనమేమీ నటులం కాదు.అయితే పెద్ద విచిత్రం ఏమిటంటే ఎప్పుడో మూడేళ్ల క్రితం చూడ్డంతో చాలా మటుకు మరచిపోయిన కథ కావడంతో రాజా కొత్తగా సృష్టించిన పార్ట్ కూడా చూసేసినదేనేమో అననిపించింది నాకు..ఈ పాత్ర చిరంజీవి మాత్రమే చేయగలడనేలాగా ఎవరైనా కొత్త కథలను సృష్టించి తీసుకొస్తే నటించాలి తప్ప “పనికి ఆహార పధకం” స్కీం లాగా బడ్జెట్ ఉంది కాబట్టి ఏదోకటి తవ్వి తీరాలి ఆన్నట్టుగా నటించి తీరాలననుకోవడం అనవసరం చిరంజీవికి.

ఫైనల్ గా నేను చెప్పేది వొకటే డైలాగ్, రాజకీయాలకు దూరంగా జరిగాడు,రాజకీయాలు మరచి పోయాడు అని నేననుకోవడం లేదు,వోపిక వుంటే రాజకీయాలలోకి వచ్చి ఫ్లాప్ అయిన చోటే హిట్ కొట్టడానికి ట్రై చేయకలిగితే అదే నిజమైన హీరోయిజం !!!

 

Raghu Sreemanthula

You missed