స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా వచ్చింది. ఆయన ఐసోలేషన్‌లో ఉండి… ఎవరినీ కలవడం లేదు. రేపు బోధన్‌లో అతని తనయుడు సురేందర్‌రెడ్డికి సంబంధించిన ట్రాక్టర్ షోరూం ప్రారంభ కార్యక్రమానికి ఆయన రావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా ఆయన రావడం లేదని తెలిసింది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. గతంలోనూ స్పీకర్‌కు కరోనా సోకింది. కోలుకోవడానికి సమయం పట్టింది. కానీ ఇప్పుడు వచ్చిన కరోనా వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇదో సాధారణ జలుబు మాదిరిగానే వచ్చి పోతుందని చెబుతున్నారు. దీని వ్యాప్తి బాగానే ఉన్నా.. ఆస్పిటల్‌లో అడ్మిట్ అవుతన్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది.