బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ .. కేటీఆర్ బర్త్‌డే వేడుకలకు హాజరుకాలేదని ముగ్గురు ఉద్యోగులకు మెమో ఇచ్చాడట. కేటీఆర్ ఫైర్ అయ్యాడు. ఇదేం పాడు అభిమానంరా అయ్యా..! నా బర్త్ డే వేడుకలకు రాకపోతే చర్యలు తీసుకుంటావా..? అసలు ఇతని పైనే సస్పెండ్ వేటు వేయండని హుకుం జారీ చేశాడు. బాగుంది. కావాల్సిందే. కానీ ఇలాంటి మున్సిపల్ కమిషన్ గంగాధర్‌కు మించి మీ చుట్టూ లీడర్లు ఈగల్లా గుమిగూడి … అత్యంత అభిమానం పేరుతో .. మీతో సాన్నిహిత్యం పేరుతో ఆయా నియోజకవర్గాల్లో…. ఇతర చోట్ల విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు.
మాట్లాడితే మా రామన్న అంటారు. రామన్నకు చెప్పమంటావా ? అని కూడా బెదిరిస్తారు. అధికారులను టార్గెట్ చేస్తారు. చెప్పింది వినకపోతే పెండ్లాం, పిల్లలను కూడా ఎత్తుకుపోతాంరోయ్… మేం మంచోళ్లం కాదు.. తెలుసా..? అని కూడా దిగజారి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. ఇవన్నీ మీకు తెలియనివి కావు. ఎవరి చరిత్ర ఏందో తెలుసు.. ఎవరు మేకవన్నె పులో తెలుసు. ప్రజల దగ్గర ఏ లీడర్‌కు ఎంత క్రెడిబిలిటీ ఉందో తెలుసు. అయినా కొందరిని మీ వెనుకేసుకోనే తిరుగుతారు. ఈ గంగాధర్‌ల కన్నా ఇలాంటి లీడర్లతోనే మీకు లక్ష రెట్లు హాని జరుగుతుంది. అదీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయలేమంటారా…? ఆ అభిమానం మత్తు వీడలేమంటారా? అయితే ఎవరేం చేయలేరు…..