రేపు పుట్టిన రోజు. ఈ రోజు కేటీఆర్ కాలుకు ఫ్రాక్చ‌ర్ అయ్యింది. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక త‌న‌ను ఎవ‌రూ క‌లిసేది ఉండ‌దు. అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఇది షాకే. పుట్టిన రోజు హ‌డావుడి చేయొద్ద‌ని, వాన‌లు, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని ఇప్ప‌టికే కేటీఆర్ చెప్పి ఉన్నాడు. ప్ర‌క‌ట‌న‌లు, ఫ్లెక్సీలు పెట్టొద్ద‌న్నాడు. ఇప్పుడు ఆయ‌న కాలుకే ఫ్రాక్చ‌ర్ కావ‌డంతో ఇంటికే ప‌రిమిత‌య్యాడు కేటీఆర్‌. ఇదే విష‌యాన్ని త‌ను ట్వీట్ చేశాడు. ఏవైనా ఓటీటీలో మంచి సినిమాలు ఇంటే సూచించండి అని కూడా ఓ స‌ల‌హా అడిగాడు.

ఇక్క‌డే కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు కొంద‌రు నెటిజ‌న్లు వెట‌కారం కామెంట్లు పెట్ట‌డం షురూ చేశాడు. కాలుకు దెబ్బ‌తాకింది. రెస్ట్ తీసుకుంటున్నాను .. అంటే స‌రిపోయేది. కానీ ఓటీటీలో సినిమాలు అడిగే స‌రికి దీన్ని ర‌చ్చ చేస్తున్నారు. మీ నాన్న ప్రెస్‌మీట్ చూడ‌మ‌ని ఒక‌రు…. వాన‌లు, వ‌ర‌ద‌ల‌తో ఆగ‌మాగం అవుతుంటే నీకు సినిమాలు కావాలా..? అని కొంద‌రు ఇలా సెటైర్లు వేస్తున్నారు. కొంద‌రు మంచి మంచి సినిమాల పేర్లు కూడా సూచిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఇప్పుడిదో చ‌ర్చ‌. ర‌చ్చ‌.

You missed