బాలీవుడ్ ఒక మోహ మాయా ప్రపంచం. పధ్నాలుగేళ్ల కరీనా , సైఫ్ అలీఖాన్ – అమృత సింగ్ ల పెళ్ళికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అంకుల్ అని చెప్పి ముప్పై తొమ్మిదేళ్లకు ఆయన్నే పెళ్ళి చేసుకుని కరీనా కపూర్ ఖాన్ గా మారడం , పదకొండేళ్ళు ఆర్బాజ్ ఖాన్ తో వివాహ సంబంధం లో ఉండి తన కన్నా పదకొండేళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా అరోరా లివ్ ఇన్ లో ఉండడం పెద్దవింతేమీ కాదు.
ఇక్కడ సబ్ కుచ్ జాయిస్ హై.వేల కోట్ల డబ్బు , వ్యాపారం , మాఫియా , కోట్ల రూపాయల ఫ్యాషన్ డిజైనింగ్ , కాస్మెటిక్ ఇండస్ట్రీ, మాడలింగ్ , మిస్ యూనివర్స్ , మిస్ వరల్డ్ పోటీలు , క్రికెట్ , డ్రగ్స్ , పవర్ , రాజకీయాలు , nexus లో ఉంటాయి.
ఇక్కడ వివాహ సంబంధాలు నిలుపుకోవడం , వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగతానికి పరిమితం చేసుకోవడం సాధ్యం కాని పని. బాలీవుడ్ మేనియా అలాంటిది. ముంబై కి వెళ్ళినప్పుడు ‘మన్నత్’ ( షారుఖ్ ఖాన్ నివాసం ) నో ‘ జల్సా’ ( అమితాబ్ బచ్చన్ నివాసం) నో దర్శించుకోకుండా బాలీవుడ్ ఫ్యాన్స్ తిరిగి స్వస్థలాలకు వెళ్ళరంటే అతిశయోక్తి కాదు. దర్శించుకోవడం అంటే ఆ నటుల ఇంటిముందు వాళ్ళ ఒక్క చూపుకోసం గంటల తరబడి ఎదురుచూడడం అంతే.. ఈ క్రేజ్ లాజిక్ కే బాహర్ హై..
బాలీవుడ్ గురించి , ముంబై భాష గురించి తాళ్ సినిమాలో అనిల్ కపూర్ చెప్పే ఒక ఫేమస్ డైలాగ్ ఉంది..
” యహా సబ్ కుచ్ దిఖావా హై జిసే హమ్ షో మ్యాన్ షిప్ కెహతే హై…సజావట్ హై జిసే హమ్ పబ్లిసిటీ కెహతే హై…బనావట్ హై జిసే హమ్ మార్కెటింగ్ కెహతే హై ”
కావున సుష్ మోడీ గురించి కూడా మనం పెద్దగా గింజుకొని స్టాండ్ విత్ హర్ అనాల్సిన పనిలేదని నా అభిప్రాయం.
Rajitha Kommu