ఒకప్పుడు పటాల్లో ప్రశాంతంగా కనపడే రాముడు, ఆంజనేయుడు, శివాజీ లాంటి బొమ్మలు ఈ పువ్వుల పాలన వచ్చాక ముఖాల్లో ఆగ్రహం ప్రదర్శిస్తున్నాయి….

సరే అవన్నీ బత్తాయి సోషల్ వింగ్ ఎడిట్ చేసి నిత్యం ఫేక్ వార్తల్లో భాగంగా వాటినీ మార్చేసారు అనుకుందాము…

విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం పై భాగంలో నిర్మించిన 6.5 మీటర్ల ఎత్తైన మన జాతీయ చిహ్నాన్ని మొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు…

కానీ దేశ పార్లమెంట్ పైన దేశం గర్వించే మూడు సింహాల (నాలుగు సింహాలు) జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాల తలలు కూడా పూర్తిగా మార్చేసారు…

నిజానికి జాతీయ చిహ్నంలోని మూడు సింహాలూ ప్రశాంతంతకు మారు పేరుగా వాటి ముఖాల్లో ప్రశాంతత కనపడుతుంది….

కానీ కొత్తగా పార్లమెంట్ పైన ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలూ గర్జిస్తున్నట్టుగా తయారు చేయడం విచిత్రం….

చరిత్రలోకి వెళితే మౌర్య వంశానికి చెందిన అశోకుడు అనే గొప్ప చక్రవర్తి కళింగ యుద్దంలో గెలిచాక, ఆ యుద్దంలో లక్షకు పైగా సైన్యం చనిపోవడం చూసి, రక్తం ఏరులై పారడం చూసి చలించి పోయి బౌద్ద మతం స్వీకరించి బౌద్ద సన్యాసిగా మారాడు, శాంతికి చిహ్నంగా సారనాథ్ లో సాంచీ స్థూపం నిర్మించాడు.. అశోకుడు నిర్మించిన ఆ సాంచీ స్తూపంలోని నాలుగు సింహాల శిల్పాన్ని మన దేశం జాతీయ చిహ్నంగా గుర్తించింది…

ఆ జాతీయ చిహ్నంలోని అశోక చక్రాన్ని మన జాతీయ పతాకం పైన చూడొచ్చు…ఆ జాతీయ చిహ్నాన్ని మన భారత కరెన్సీ పైనా, నాణేల పైనా, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చూడొచ్చు…

కానీ చివరికి అంత గొప్ప చరిత్ర కలిగిన మన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలు గర్జిస్తున్నట్టుగా మార్చి, పార్లమెంట్ పైన ఆవిష్కరించడం అనేది మన జాతీయ చిహ్నాన్ని అవమానించడమే కాకుండా, భారత దేశ చరిత్రను కూడా అవహేళన చేయడమే అవుతుంది.

By Shaik Chand

You missed