కొందరంతే.. భయం అనే పదం వీళ్ళ డిక్షనరీలోనే ఉండదు.ఒంటరిగా వెళ్ళి కొండల్ని ఢీకొంటాం అంటారు.ఎన్ని అడ్డంకులు వచ్చినా తగ్గేదే ల్యా అంటారు.ఎన్ని సవాళ్లు ఎదురైనా చేయాలనుకున్న పని చేస్తారు.చెప్పాలనుకున్న విషయం చెప్పి తీరతారు. విమర్శలకు ఏమాత్రం వెరువని ధీర ” లీనా మణిమేఖలై ” గురించి మీకు తెలుసా..? కాళీ సినిమా ప్రోమో లో పొగ త్రాగుతున్న కాళికదేవి పోస్టర్ చూశారా.. ఆ మూవీ మేకర్ లీనా..నలభై రెండేళ్ళ ఈ అరుదైన ఛాంపియన్ రచయిత్రి , కవయిత్రి , డాషింగ్ ఫిల్మ్ మేకర్ గురించి క్లుప్తంగా…

మధురై లోని టీచర్ ఐ.రఘుపతి , రమ దంపతుల కుమార్తె లీనా.హోలీ క్రాస్ హైస్కూల్ లో చదివింది .తమ కుటుంబం లోని అందరి అమ్మాయిల్లాగానే వరసైన దగ్గరి బంధువుతో లీనా కు పెళ్ళి చేయాలని అందరూ తీర్మానించారు. ఆ పెళ్ళి ఇష్టం లేని లీనా ఇంట్లోనుండి చెన్నై పారిపోయింది. చెన్నైలోని తండ్రి స్నేహితుల ద్వారా తిరిగి ఇంటికి చేరుకుంది.బి. ఇ. ఇన్స్ట్రుమెంటేషన్ చేసింది. తనకు ఈ ఫీల్డ్ సూట్ కాదనుకుని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్ , ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్స్ చేసింది. అనుకోకుండా దర్శకుడు భారతీరాజా ను కలిసింది. అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.కమర్షియల్ సినిమాలు తన కప్ ఆఫ్ టీ కాదని తెలుసుకుంది.

ఉద్యోగం చేసుకుంటూ డాక్యుమెంటరీలు , టెలీ ఫిలిమ్స్, మూవీస్ ,సినిమాలు తీసింది లీనా ..
తమిళనాడు గ్రామాల్లో ఉన్న జోగినీ లాంటి దూరాచారాన్ని ఖండిస్తూ ” మాతమ్మ ” అనే ఫిల్మ్ తీసింది. దళిత స్త్రీల పట్ల హింసను లైంగిక వేధింపుల పై ” పరాయి ” తీసింది. శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల చితికిపోయిన కుటుంబాల పై , మాయం అయిపోయిన వాళ్ళ జీవితాలపై ( Enforced Disappearances ) ” White van stories ” తీసింది.

సునామీ వల్ల తుడిచిపెట్టుకొని పోయిన జీవితాలను ఇతివృత్తంగా ‘Waves after waves’ అనే సినిమా తీసింది.
ధనుష్కోటి లోని చేపలుపట్టేవాళ్ళ సమస్యల పై 2011 లో లీనా తీసిన ” సెంగదల్ ” వివాదాస్పదమైంది. భారత్ శ్రీలంక ప్రభుత్వాలపై రాజకీయ వ్యాఖ్యలతోపాటు అన్ పార్లమెంటరీ భాష ఉందని ఆ సినిమాను నిషేధించారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ లో కేస్ వేసింది లీనా. ఆరునెలలకు ఆ సినిమా విడుదలైంది.

చెన్నై లోని నీటి కొరత నుండి జాతుల మధ్య అంతర్యుద్ధాల దాకా లీనా ఎంచుకున్న ఇతివృత్తాలు , వాటిల్లో ఆమె తన pov ను చెప్పే తీరు దేశవిదేశాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.

ఆమెకు వరుసగా 2004 , 2005, 2006, 2007 , 2008 లో బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్స్ వచ్చాయి. చికాగో , పారిస్ , నార్వే, మలేసియా , మ్యునిచ్, బ్రిస్బేన్ , సియోల్ లో ఆమె చిత్రాలు ప్రదర్శించారు. కామన్ వెల్త్ ‘ బర్డ్స్ ఐ వ్యూ ‘ , ‘ వన్ బిలియన్ అయిస్ ‘ అవార్డులు , గోల్డెన్ కాంక్ అవార్డ్..ఆమె కవిత్వానికి ఐయల్ బెస్ట్ పోఎట్రీ అవార్డ్ , ఆమె నవల ‘ అంతఃకరణి ‘ కు స్రిష్టి తమిళ్ లామ్ద అవార్డ్ వచ్చాయి.

బ్రేక్ ద షాకిల్స్ అనే మూవీ లో ప్రయివేటీకరణ తమిళనాడు పల్లెల్లో తెచ్చిన మార్పులపై చర్చిస్తే , లవ్ లాస్ట్ అనే ఫిల్మ్ మారిన మానవ సంబంధాల గురించి చెప్తుంది. ప్రస్తుతం లండన్ లో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ ఆఫ్రికన్ స్టడీస్ లో స్కాలర్ గా ఉన్న లీనాకు కామన్వెల్త్ ఫెలోషిప్ కూడా ఉంది.

లీనా మణిమేఖలై గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకోడానికి కారణం కాళీమాత పొగ త్రాగుతున్న పోస్టర్ . ఇంతకుముందు అనేకసార్లు CBFC పై విరుచుకుపడ్డ లీనా ఈ పోస్టర్ వివాదాస్పదం కావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదు అన్నారు. సినిమా చూడకుండా జడ్జ్ చేయకండి. ముందు నేనేం చెప్పానో చూడండి అంటుంది. లీనా పై ఢిల్లీ , యూ. పీ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , బెంగాల్ లలో FIR లు నమోదయ్యాయి. సంఘీయులు ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారు. బీజేపీ నేతలు ఆ పోస్టర్ వల్ల తమ మనోభావాలు గాయపడ్డాయని ఆమె తల తీసేవరకు ఊరుకోమని అంటున్నారు. టొరంటో లో కాళీ ఫిల్మ్ ను నిషేధించారు. కెనడా లోని హాంగకాంగ్ బిల్డింగ్ లో ప్రదర్శన ను అడ్డుకున్న హిందువులను అక్కడి అధికారులు క్షమాపణ కోరి సినిమాను ఆపేశారు.

మహువ మొయిత్ర లాంటి నేతలు కొందరు లీనా ను సపోర్ట్ చేస్తున్నారు. మతం లాంటి సున్నితమైన అంశాలను డీల్ చేయడం తనకు తెలుసునని , ప్రేమనూ మతాన్ని ఏ విధంగా పోర్ట్రే చేసానో సినిమా చూస్తేనే అర్ధమవుతుంది అని లీనా అంటున్నారు.

ఇప్పట్లో ఈ పోస్టర్ వివాదం సద్దుమణిగేలా లేదు.కాళీ సినిమా విడుదల సాధ్యం అవుతుందో కాదో..

Rajitha Kommu

You missed