#హైదరాబాద్ రండ్రి – #హ్యాపీగావెళ్ళండి
#దయచేసి కలహాలు పెట్టకండి

#హైదరాబాద్ కు ఎవరైనా సంతోషంగా రండి…
చారిత్రక చార్మినార్ అందాలు చూడండి…
గోల్కొండ కోట గత వైభవాన్ని దర్శించండి…
గండిపేట చెరువు గట్టున సేదతీరండి…
కొండచిలువలా నగరాన్ని చుట్టిన రింగురోడ్డు వంకలు చూడండి…
తీగల వంతెన తీరును, మెట్రోరైలు పరుగును చూడండి…
హైటెక్ సిటీ హంగులు, ఎన్టీఆర్ గార్డెన్ పూల రంగులు చూడండి…
ట్యాంక్ బండ్ పై గంతులు వేయండి…
హుస్సేన్ సాగర్ లోని బుద్దుని చూడండి…
హైదరాబాద్ దమ్ బిర్యానీ తినండి..
ఇరానీ దమ్ చాయ్ తాగి, మజా చేసి మంచిగ పోండి…
కానీ
🙏దయచేసి
విద్వేష విషం చిమ్మి…
అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్న మా మధ్య చిచ్చు పెట్టి పోకండి… మీ సలీంపాష.

Saleem Pasha Oujac

You missed